తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆ వెబ్​సిరీస్​లో వేశ్యగా సోనాక్షి సిన్హా - హీరామండి

బాలీవుడ్​ దర్శకుడు సంజయ్​ లీలా భన్సాలీ(Sanjay Leela Bhansali) రూపొందిస్తున్న తొలి వెబ్​సిరీస్​ 'హీరా మండి'. ఇందులో వేశ్య పాత్ర కోసం సోనాక్షి సిన్హాను(Sonakshi Sinha) ఎంపిక చేశారని తెలిసింది. ఇందులోని పాత్ర కోసం ఆమె ప్రత్యేకంగా కథక్​ డ్యాన్స్​ను నేర్చుకుంటున్నట్లు బాలీవుడ్​ వర్గాలు అంటున్నాయి.

Sonakshi Sinha joins Sanjay Leela Bhansali's Heera Mandi
ఆ వెబ్​సిరీస్​లో వేశ్యగా సోనాక్షి సిన్హా

By

Published : Jul 6, 2021, 10:18 PM IST

ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ(Sanjay Leela Bhansali) తొలి వెబ్‌సిరీస్‌లో సోనాక్షి నటించడం దాదాపు ఖాయమైనట్టు తెలుస్తోంది. ఆయన ఇటీవలే 'గంగూబాయి కతియావాడి' చిత్రీకరణను పూర్తి చేశారు. ఆలియాభట్‌(Alia Bhatt) ప్రధాన పాత్రలో నటించిన చిత్రమిది. ఇప్పుడు ఆయన దృష్టంతా భారీస్థాయిలో తెరకెక్కనున్న 'హీరామండి'(Heera Mandi) వెబ్‌ సిరీస్‌పైనే ఉంది. ఆయన నుంచి రానున్న తొలి వెబ్‌సిరీస్‌ ఇది.

ఇందులో ఇప్పటికే హ్యూమా ఖురేషి(Huma Qureshi) ఎంపికైంది. ఇప్పుడు మరో ప్రధాన పాత్ర కోసం సోనాక్షి సిన్హాను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఇందులో ఆమె వేశ్యగా నటించనుంది. ఇందులో భాగంగా ఆ పాత్ర కోసం కథక్‌ డ్యాన్స్​ కూడా నేర్చుకుంటుందని తెలుస్తోంది.

"హీరామండి'లో పాటలు చాలా కీలకం కావడం వల్ల వాటిని అద్భుతంగా తెరపైకి తీసుకురావాలని భన్సాలీ భావిస్తున్నారు" అని దర్శకుడి సన్నిహిత వర్గాలు చెప్పారు. గతంలో సోనాక్ భన్సాలీ నిర్మించిన 'రౌడీ రాథోడ్‌'లోనూ నటించింది.

ఇదీ చూడండి..Malvika Sharma: నీ సొగసు చూడతరమా!

ABOUT THE AUTHOR

...view details