తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆన్​లైన్ వేధింపులకు పాడాలి చరమగీతం' - Sonakshi Sinha about Cyber Bullying

ఆన్​లైన్ వేధింపులకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైందంటున్నారు బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా. దీనిని నివారించేందుకు మిషన్ జోష్ పేరుతో ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

'ఆన్​లైన్ వేధింపులకు పాడాలి చరమగీతం'
'ఆన్​లైన్ వేధింపులకు పాడాలి చరమగీతం''ఆన్​లైన్ వేధింపులకు పాడాలి చరమగీతం'

By

Published : Jul 26, 2020, 5:40 PM IST

ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న ఇబ్బందుల్లో ఆన్‌లైన్‌ వేధింపులు ఒకటి. వ్యక్తుల ఫొటోలను అశ్లీలంగా మార్చడం, అసభ్య కామెంట్లు పెట్టడం, బెదిరింపులు, వేధింపులు ఈ మధ్యకాలంలో ఎక్కువైపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌ వేధింపులకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైందంటున్నారు బాలీవుడ్‌ నటి సోనాక్షి సిన్హా. ఆన్‌లైన్‌ వేధింపులను నివారించడం కోసం ఆమె మహారాష్ట్ర పోలీసులతో చేతులు కలిపారు. 'మిషన్‌ జోష్‌' పేరుతో ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు సోనాక్షి ఓ వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.

"ఆన్‌లైన్‌ వేధింపులను అంతం చేసేందుకు 'మిషన్‌ జోష్‌' పేరుతో ప్రచార కార్యక్రమం ప్రారంభించాం. ఇందుకోసం స్పెషల్‌ ఐజీపీ ప్రతాప్‌ దిఘవ్‌కర్‌తో చేతులు కలిపాం. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు ఆన్‌లైన్‌ వేధింపులపై అవగాహన కల్పించబోతున్నాం. ఆన్‌లైన్‌ వేధింపులు బాధితుల మానసిక స్థితిపై ఎలా ప్రభావం చూపుతాయో తెలియజేస్తాం. ఇక చాలు. ఆన్‌లైన్‌ వేధింపులు ఉండకూడదు"’ అంటూ సోనాక్షి తన పోస్టుకు కాప్షన్‌ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details