తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఒంటి చేత్తో అక్షయ్​ను కింద పడేసిన సోనాక్షి! - ప్రముఖ శాస్త్రవేత్త రాకేష్‌ ధావన్‌

బాలీవుడ్​ కిలాడీ అక్షయ్​ కుమార్​ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'మిషన్​ మంగళ్​'. ఇస్రో శాస్త్రవేత్తలుగా విద్యా బాలన్‌, నిత్యా మీనన్‌, తాప్సీ, విద్యాబాలన్‌, సోనాక్షి సిన్హా, కృతి కుల్హరి నటించారు. ప్రస్తుతం సినిమా ప్రచారంలో బిజీగా ఉన్న ఈ బృందం... ఇటీవల ఓ చిట్​చాట్​లో పాల్గొంది. అయితే ఆ కార్యక్రమంలో హీరో అక్షయ్​కుమార్​ను​ ఒంటిచేత్తో కింద పడేసింది హీరోయిన్‌ సోనాక్షి సిన్హా.

ప్రచారం కోసమే సోనాక్షి ఈ ఫీట్​ చేసిందా..!

By

Published : Aug 11, 2019, 10:54 AM IST

బాలీవుడ్​ భామ సోనాక్షి సిన్హా, అక్షయ్‌ కుమార్​ను కింద పడేసింది. 'దబాంగ్'​ నటి ఒంటిచేత్తో తోయగానే కింద పడ్డాడీ స్టార్​హీరో. 'మిషన్​ మంగళ్​' ప్రచార కార్యక్రమాల్లో ఈ ఆసక్తికర సంఘటన జరిగింది.

సినిమాలోని నటీనటులు అక్షయ్‌ కుమార్‌ సహా నిత్యామీనన్‌, తాప్సీ, విద్యాబాలన్‌, కీర్తి కుల్హరి, సోనాక్షి సిన్హా అందరూ కూర్చొని ఉన్నారు. ఆ సమయంలో అక్షయ్‌ సినిమా విశేషాలు వివరిస్తూ కుర్చీతో పాటు వెనక్కి వాలాడు. అప్పుడు పక్కనే ఉన్న సోనాక్షి.. అతడి ఛాతిపై చేత్తో కొట్టింది. వెంటనే కుర్చీతో సహా వెనక్కి పడిపోయాడు కిలాడీ హీరో. ఈ ఘటనకు అందరూ ఒక్కసారి ఆశ్చర్యానికి గురయ్యారు. సోనాక్షి మాత్రం కావాలనే చేశానని పెద్దగా నవ్వింది. ఆ సమయంలో తీసిన వీడియోను ఆమె... తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది.

'మిషన్​ మంగళ్​' చిత్రానికి జగన్‌ శక్తి దర్శకుడు. ప్రముఖ శాస్త్రవేత్త రాకేష్‌ ధావన్‌ జీవితాధారంగా తెరకెక్కిన ఈ చిత్రం... ఆగస్టు​ 15న విడుదల కానుంది.

ABOUT THE AUTHOR

...view details