తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'మా నాన్న ఆ పని ఎప్పుడో చేయాల్సింది' - bjp

శత్రఘ్న సిన్హా భాజపాను వీడి కాంగ్రెస్​ బాట పట్టడంపై ఆయన కూతురు సోనాక్షి సిన్హా స్పందించింది.

'గౌరవం లేనిచోట మార్పు కోరుకోవడం మంచిదే'

By

Published : Mar 30, 2019, 1:00 PM IST

బాలీవుడ్​ నటుడు శత్రఘ్న​ సిన్హా భాజపాను వదిలి కాంగ్రెస్​లో చేరాలని నిర్ణయించుకోవడంపై చాలా విమర్శలు వచ్చాయి. ఆయన కుమార్తె, బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా ఈ విమర్శలను తోసిపుచ్చింది.

'పార్టీ మారడం అనేది నా తండ్రి నిర్ణయం. ఎక్కడైనా ఆనందంగా ఉండలేకపోయినపుడు మార్పు కోరుకుంటాం. అదే ఆయన చేశారు. కొత్తగా జట్టుకట్టిన కాంగ్రెస్​తో కలిసి మరిన్ని మంచి పనులు చేయాలని కోరుకుంటున్నా'.

--బాలీవుడ్​ నటి, సోనాక్షి సిన్హా

మీడియాతో మాట్లాడుతున్న సోనాక్షి సిన్హా
"భాజపా సీనియర్లు జేపీ నారాయణ్​, వాజ్​పేయీ, అడ్వాణీతో కలిసి మా నాన్న పనిచేశారు. పార్టీ అంటే ఆయనకు చాలా అభిమానం. అయితే వీరందరికీ రావాల్సినంత గౌరవం దక్కలేదు. అందుకే మా తండ్రి పార్టీ మారారు. ఆయన ఆ పని ఎప్పుడే చేయాల్సింది. కాస్త ఆలస్యంగా చేశారు" అని చెప్పింది సోనాక్షి.

ABOUT THE AUTHOR

...view details