డైలాగ్ కింగ్ మోహన్‌బాబు కథానాయకుడిగా... దేశభక్తి ప్రధానంగా తెరకెక్కుతున్న చిత్రం 'సన్ ఆఫ్ ఇండియా'. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా రూపొందిస్తున్నాయి. విష్ణు మంచు నిర్మాత. బుధవారం హైదరాబాద్‌లో రెండో షెడ్యూల్ చిత్రీకరణ మొదలైంది. ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు.
'సన్ ఆఫ్ ఇండియా' రెండో షెడ్యూల్ ప్రారంభం - సన్ ఆఫ్ ఇండియా షూటింగ్
విలక్షణ నటుడు మోహన్ బాబు ప్రధానపాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం 'సన్ ఆఫ్ ఇండియా'. దేశభక్తి కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ బుధవారం నుంచి తిరిగి ప్రారంభమైంది.
"తెలుగులో ఇప్పటివరకు చూడని ఒక విభిన్నమైన కథతో ఈ చిత్రం రూపొందుతోంది. కథా నేపథ్యం కొత్తగా ఉంటుంది. మోహన్‌బాబు శక్తిమంతమైన పాత్రలో కనిపిస్తారు. ఆయనే చిత్రానికి స్క్రీన్‌ప్లే రాశారు. మోహన్‌బాబుకు స్టైలిస్ట్‌గా ఆయన కోడలు విరానికా మంచు వ్యవహరిస్తున్నారు. ఆయన్ని సరికొత్త రూపంలో తెరపై చూపిస్తార"ని చిత్రవర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి సంగీతం: ఇళయరాజా, ఛాయాగ్రహణం: సర్వేష్ మురారి, సంభాషణలు: తోటపల్లి సాయినాథ్, పాటలు: సుద్దాల అశోక్‌తేజ, కూర్పు: గౌతంరాజు, కళ: చిన్నా.