పవర్‌ఫుల్ పంచ్ డైలాగ్స్, హీరోయిజంతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమాలు తెరకెక్కిస్తుంటారు దర్శకుడు పూరీ జగన్నాథ్. కథకు తగ్గట్టుగా ఆయన పెట్టే టైటిల్స్‌కి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. డాషింగ్ టైటిల్స్‌తో అభిమానులకు కిక్ ఇవ్వడం పూరీకి అలవాటు. తాజాగా విజయ్ దేవరకొండతో తెరకెక్కిస్తోన్న కొత్త చిత్రానికి 'లైగర్' అనే టైటిల్ ఖరారు చేశారు. అయితే పూరీ.. తాను దర్శకత్వం వహించిన పలు చిత్రాలకు మొదట ఒక టైటిల్ అనుకుని తర్వాత పలు కారణాలు వల్ల వాటిని మార్చారు. అవేంటో చూద్దాం.
లైగర్
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రధానపాత్రలో పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'లైగర్'. అయితే ఈ సినిమాకు మొదట 'ఫైటర్' అనే టైటిల్‌ను అనుకున్నట్లు వార్తలు వచ్చాయి. పరిశీలనాత్మక టైటిల్గానూ ఈ పేరు ప్రాచూర్యంలోకి వచ్చింది. కానీ అనూహ్యంగా ఈ టైటిల్‌ను 'లైగర్'గా మార్చారు. ('లైగర్' అంటే మగసింహం, ఆడపులికి జన్మించిన సంకరజాతి సంతానం అని అర్థం)
చిరుత
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ కథానాయకుడిగా వెండితెరకు పరిచయమైన చిత్రం 'చిరుత'. అయితే ఈ సినిమాకు మొదట 'కుర్రాడు' అనే టైటిల్ పెట్టాలనుకున్నారు. 'లో క్లాస్ ఏరియా' ఉపశీర్షిక. అయితే చిరు తనయుడు అనే అర్థం వచ్చేట్టుగా 'చిరుత' అనే పేరును ఫైనల్ చేశారు. ఈ టైటిల్‌కు మంచి స్పందన లభించింది.
బద్రి