హీరో సాయితేజ్, నభా నటాషా జంటగా సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'సోలో బ్రతుకే సో బెటర్'. డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా ఈ చిత్రం థియేటర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా కథానాయకుడు సాయితేజ్‌తో పాటు హాస్యనటులు సత్య, వెన్నెల కిషోర్‌ను.. ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఇంటర్వ్యూ చేశారు. వీరి మధ్య సాగిన సరదా సరదా సంభాషణలలో.. హీరో సాయితేజ్ ఓ ఆసక్తికర విషయం చెప్పారు. ఈ చిత్రం వల్ల తన పెళ్లి రెండేళ్ల పాటు వాయిదా పడిందని అన్నారు.
"సరైన సమయంలో సినిమా చేశాను. మా ఇంట్లో ఎవరైనా నా పెళ్లి గురించి అడిగితే సోలో బ్రతుకే సో బెటర్ అని చెప్పేంత ధైర్యం ఉంటుంది. మా అమ్మ నన్ను పెళ్లి చేసుకోమని, నేనేమో చేసుకోనని.. ఇద్దరి మధ్య సంభాషణ జరుగుతూ ఉంటుంది. ఇలాంటి సమయంలో ఈ సినిమా నా దగ్గరకు వచ్చింది. అచ్చం నా క్యారెక్టర్యే చేసే అవకాశం వచ్చింది. అందుకే ఈ సినిమాలో చాలా సులభంగా నటించగలిగా. మొత్తంగా ఈ సినిమా వల్ల నాకు ఓ లాభం జరిగింది. నా పెళ్లి రెండేళ్ల పాటు వాయిదా పడింది (నవ్వుతూ)."