తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సాయితేజ్ ప్యాకప్​.. రాజ్​తరుణ్ రిలీజ్​కు రెడీ​ - శ్రియా సరన్ న్యూస్​

లాక్​డౌన్​తో ఇంటికే పరిమితమైన నటీనటులు షూటింగ్​ల్లో పాల్గొంటున్నారు. సినిమాలను కూడా ఓటీటీల్లో విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే 'సోలో బ్రతుకే సో బెటర్' చిత్రీకరణ పూర్తి చేసుకోగా, 'ఒరేయ్​ బుజ్జిగా' ఓటీటీలో రానుందని ప్రకటించారు.

Solo Brathuke So Better shooting was wrapped and moves to Post-production phase! #SBSB
గుమ్మడికాయ కొట్టిన సాయితేజ్​.. విడుదలకు సిద్ధమైన రాజ్​

By

Published : Sep 11, 2020, 2:01 PM IST

దాదాపు ఆరు నెలల తర్వాత తిరిగి రామోజీ ఫిల్మ్​సిటీలో షూటింగ్ మొదలుపెట్టిన 'సోలో బ్రతుకే సో బెటర్' బృందం.. శుక్రవారంతో(సెప్టెంబరు 11) దానిని పూర్తి చేసింది. ఈ విషయాన్ని హీరో సాయిధరమ్ తేజ్ ట్వీట్ చేశారు. సరదా సరదాగా సాగిన మాసినిమా షూటింగ్ పూర్తయిందని రాసుకొచ్చారు.

'సోలో బ్రతుకే సో బెటర్​' చిత్రబృందం

ఈ సినిమాలో నభా నటేష్​ హీరోయిన్​. తమన్​ స్వరాలు అందించారు. సుబ్బు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. బీవీఎస్​ఎన్​ ప్రసాద్​ నిర్మాత. త్వరలో విడుదలపై స్పష్టతనివ్వనున్నారు.

'ఆహా'లో 'బుజ్జి'గాడు

యువ కథానాయకుడు రాజ్​ తరుణ్​, మాళవిక నాయర్​, హెబ్బా పటేల్​ కలిసి నటించిన సినిమా 'ఒరేయ్​ బుజ్జిగా'. ఎప్పటినుంచి థియేటర్లలో విడుదల చేయాలని భావించారు. ప్రస్తుత పరిస్థితుల్లో వాటిని తెరిచేలా కనిపించడం లేదు. అందుకే 'ఆహా' ఓటీటీలో తీసుకురానున్నట్లు శుక్రవారం ప్రకటించారు. అక్టోబరు 2 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని తెలిపారు. విజయ్​ కుమార్​ కొండా దర్శకత్వం వహించగా, కె.కె.రాధామోహన్​ నిర్మించారు.

శ్రియ 'గమనం' పాన్-ఇండియా వైపు

నటి శ్రియ శరణ్​ ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్​-ఇండియా చిత్రం 'గమనం'. శుక్రవారం ఆమె పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్​లుక్​ను విడుదల చేశారు ప్రముఖ దర్శకుడు క్రిష్​. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా. సుజనా రావు దర్శకురాలు. ఇళయరాజా సంగీతాన్ని అందించారు. రమేష్​ కారుటూరి, వెంకీ, జ్ఞాన శేఖర్​ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details