తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మన నినాదం ఒక్కటే.. 'సోలో బ్రతుకే సో బెటర్' - nabha natesh news

వాలంటైన్స్​ వారంలో సందడి చేసేందుకు 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమా థీమ్ సాంగ్​ను విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ట్వీట్ చేస్తూ, కొత్త ఫొటోను పోస్ట్​ చేశాడు హీరో సాయితేజ్.

మన నినాదం ఒక్కటే.. 'సోలో బ్రతుకే సో బెటర్'
హీరో సాయితేజ్

By

Published : Feb 1, 2020, 10:26 AM IST

Updated : Feb 28, 2020, 6:11 PM IST

గత డిసెంబరులో 'ప్రతిరోజూ పండగే' అంటూ కుటుంబంతో కలిసొచ్చిన మెగాహీరో సాయితేజ్.. ఈ సారి ఒంటరిగా వస్తున్నాడు. 'సోలో బ్రతుకే సో బెటర్' అంటూ సింగిల్స్​కు నాయకత్వం వహిస్తున్నాడు. అందుకు సంబంధించిన కొత్త పోస్టర్​ను ట్విట్టర్​లో పంచుకున్నాడు. "సోలో సోదర సోదరీమణులారా...ఈ వాలంటైన్స్ వీకెండ్ మనం అంతా కలిసి జరుపుకుందాం... మన స్లోగన్ ఒకటే... సోలో బ్రతుకే సో బెటర్ 💪🏼" అంటూ రాసుకొచ్చాడు.

హీరో సాయితేజ్ ట్వీట్

ఇందులో నభా నటేశ్ హీరోయిన్​గా నటిస్తోంది. తమన్ సంగీతమందిస్తున్నాడు. సుబ్బు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. బీవీఎస్​ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. మే 1న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

Last Updated : Feb 28, 2020, 6:11 PM IST

ABOUT THE AUTHOR

...view details