సహజత్వానికి విరుద్ధంగా అబ్బాయి గర్భం దాలిస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనే కథతో తెలుగులో 'మిస్టర్ ప్రెగ్నెంట్'(mr pregnant movie) పేరుతో సినిమా తీస్తున్నారు. 'బిగ్‌బాస్'(Bigg Boss) ఫేమ్ సయ్యద్ సొహెల్ హీరోగా నటిస్తున్నాడు. మైక్ టీవీ పతాకంపై అప్పిరెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వింజనపాటి శ్రీనివాస్ దర్శకత్వం వహించారు.
Sohel New Movie: 'మిస్టర్ ప్రెగ్నెంట్'గా బిగ్‌బాస్ సొహెల్ - Bigg boss sohel new movie
వినూత్న కథతో తెరకెక్కిస్తున్న 'మిస్టర్ ప్రెగ్నెంట్' ఫస్ట్ లుక్ గ్లింప్స్ అలరిస్తోంది. సినిమాపై అంచనాల్ని పెంచేస్తోంది. సొహెల్(sohel movie) ఇందులో కథానాయకుడిగా చేశాడు.

సొహెల్
'మిస్టర్ ప్రెగ్నెంట్' ఫస్ట్ లుక్ గ్లింప్స్‌ను నేచురల్ స్టార్ నాని ఆదివారం విడుదల చేసి, చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. 'ఇప్పుడు ఫైట్ ఏంటీ బ్రో.. కడుపుతో ఉన్నాను' అంటూ సొహెల్ చెప్పే సంభాషణలు సినిమాపై ఆసక్తి పెంచుతున్నాయి. ఇందులో సొహెల్ సరసన రూప నటిస్తోంది. సుహాసిని మణిరత్నం, బ్రహ్మాజి, అలీ, హర్ష కీలక పాత్రలు పోషించారు.
ఇవీ చదవండి: