తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అక్టోబరులో బంగార్రాజు సందడి షురూ..? - సోగ్గాడే చిన్ని నాయనా

రొమాంటిక్​ ఎంటర్​టైనర్​గా వచ్చిన 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమాలో కింగ్​ నాగార్జున చేసిన అల్లరి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. మంచి విజయం అందుకున్న ఈ చిత్ర ప్రీక్వెల్​కు అక్టోబరులో పట్టాలెక్కనున్నట్లు సమాచారం.

బంగర్రాజుగా నాగార్జున

By

Published : Aug 27, 2019, 11:11 AM IST

Updated : Sep 28, 2019, 10:42 AM IST

సొగ్గాడే చిన్నినాయనా సినిమాకు ప్రీక్వెల్​గా​ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఎప్పుడో పట్టాలెక్కాల్సిన ఈ చిత్రం ఆలస్యమైంది. ఈ సినిమా దర్శకుడు కల్యాణకృష్ణ సోదరుడి మరణం తదితర కారణాల వల్ల ప్రారంభం కాలేదు.

ప్రస్తుతం స్క్రిప్ట్​ పూర్తయ్యే దశలో ఉందని... చిత్రం అక్టోబర్​లో పట్టాలెక్కనుందని సమాచారం. అనుకున్న సమయానికి షూటింగ్​ మెుదలయితే, వచ్చే వేసవిలో సినిమాలో విడుదలకానుంది.

ఇందులో నాగ్​ సరసన రమ్యకృష్ణ కనిపంచనుందని, నాగచైతన్య ప్రత్యేక పాత్రలో నటించనున్నాడని సమాచారం. నిర్మాతగా నాగార్జున వ్యవహరించనున్నాడు.

ఇదీ చూడండి: 'సాహో 2'కు అప్పుడే కథ రాసేశారా...!

Last Updated : Sep 28, 2019, 10:42 AM IST

ABOUT THE AUTHOR

...view details