తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పవన్​, రజనీకాంత్​లను అనుకరించిన సుడిగాలి సుధీర్ - సుడిగాలి సుధీర్ సినిమా

హైదరాబాద్​లో జరిగిన 'సాఫ్ట్​వేర్ సుధీర్' ప్రెస్​మీట్​లో హీరో సుధీర్.. పలు ఆసక్తికర విషయాలు చెప్పాడు. ఈ సినిమాలో స్టార్ హీరోలు, పవన్, రజనీలను అనుకరించానని అన్నాడు.

'సాఫ్ట్​వేర్ సుధీర్' సినిమాలో సుడిగాలి సుధీర్-ధన్య బాలకృష్ణ

By

Published : Nov 7, 2019, 6:59 PM IST

'జబర్దస్త్‌'తో హాస్యనటుడిగా సినీప్రియులకు చేరువయ్యాడు సుడిగాలి సుధీర్‌. 'సాఫ్ట్​వేర్ సుధీర్' అనే సినిమాతో హీరోగా పరిచయమవుతున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా హైదరాబాద్​లో సమావేశం ఏర్పాటు చేసిన చిత్రబృందం... సినిమాకు సంబంధించిన పలు విశేషాలను పంచుకుంది.

హైదరాబాద్​లో 'సాఫ్ట్​వేర్ సుధీర్' ఈవెంట్

"ఈ సినిమా విషయంలో నాకెన్నో సర్‌ప్రైజ్‌లు ఎదురయ్యాయి. పెద్ద పెద్ద టెక్నీషియన్స్‌తో పనిచేసే అవకాశం దక్కింది. నేను ఆశించిన అంశాలన్నీ ఇందులో కనిపించాయి. ఈ చిత్రానికి కథే హీరో. పవన్‌ కల్యాణ్, రజనీకాంత్‌లను నేను ఆరాధిస్తాను. వాళ్లిద్దరినీ ఈ చిత్రంలో అనుకరించాను. నేను సినిమాల్లోకి రావడానికి చిరంజీవి స్ఫూర్తి" -సుడిగాలి సుధీర్, హీరో-హాస్య నటుడు

చిత్ర ప్రారంభోత్సవం రోజు సుధీర్ క్రేజ్‌ చూసి షాక్‌ అయ్యానని చెప్పింది హీరోయిన్​ ధన్య బాలకృష్ణ. తన స్నేహితుల్లో చాలా మంది అతడి అభిమానులేనని తెలిపింది.

ఈ సినిమాకు రాజశేఖర్​ రెడ్డి దర్శకత్వం వహించాడు. కె.శేఖర్​రాజు నిర్మించారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ఇది చదవండి: 'సాఫ్ట్​వేర్'గా మారిన సుడిగాలి సుధీర్​..!

ABOUT THE AUTHOR

...view details