'మణికే మాగే హితే' అంటూ పాట(manike mage hithe song) పాడి.. ప్రపంచ వ్యాప్తంగా సంగీత ప్రియుల మనసుదోచుకున్న శ్రీలంక పాప్ సింగర్ యొహాని డిసిల్వా(yohani singer).. త్వరలో బాలీవుడ్లో గాయనిగా అడుగుపెట్టనుంది. అజయ్ దేవగణ్, సిద్దార్థ్ మల్హోత్రా, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న 'థ్యాంక్ గాడ్'(thank god movie) చిత్రంలో యొహాని 'మణికే..' పాటని హిందీ వెర్షన్లో పాడనుంది. ఈ విషయాన్ని మంగళవారం టీ-సిరీస్ సంగీత నిర్మాణ సంస్థ అధికారికంగా సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించింది.
Manike Mage Hithe: బాలీవుడ్లో ఛాన్స్ కొట్టేసిన యొహాని - మనికే మగే హితే థ్యాంక్ గాడ్
'మణికే మాగే హితే' పాట(manike mage hithe song)తో సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా నిలిచింది యొహాని డిసిల్వా(yohani singer). దీంతో బాలీవుడ్లో అవకాశం దక్కించుకుంది.
'థ్యాంక్ గాడ్'(thank god movie) చిత్రానికి నిర్మాతగా భూషణ్ కుమార్, దర్శకుడిగా ఇంద్రకుమార్ వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత భూషణ్ కుమార్ యొహానితో కలిసి పనిచేయడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. భారతీయ అభిమానులకు ఈ హిట్ ట్రాక్‌ని అందించడం, ప్రతిభావంతురాలైన యొహాని(yohani singer)తో కలిసి పనిచేయడం థ్రిల్లింగ్‌గా ఉందన్నారు. ఇక యొహాని మాట్లాడుతూ.. "భారత్ నుంచి చక్కటి ప్రేమ, ఆదరణ లభించింది, 'థ్యాంక్ గాడ్' టీమ్‌కి నా కృతజ్ఞతలు. త్వరలో ఇండియాకి వచ్చేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా"నని తెలిపింది.