తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Gadwal Bidda Passes Away : సోషల్ మీడియా సెన్సేషన్ 'గద్వాల బిడ్డ' కన్నుమూత - గద్వాల బిడ్డ మల్లికార్జున్ మృతి

Gadwal Bidda Passes Away : 'అది కూడా కరెక్టే కదా సార్' అనే డైలాగ్​తో పాపులర్ అయిన గద్వాల బిడ్డ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. ఓ వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వీడియో వైరల్ అవ్వడంతో ఓవర్​నైట్​లో ఫేమస్ అయిన మల్లికార్జున్ రెడ్డి అనారోగ్యంతో కన్నుమూశాడు. చిన్నప్పటి నుంచే అస్తమాతో బాధపడుతున్న మల్లికార్జున్.. ఆరోగ్యం క్షీణించడంతో ఆదివారం రోజున మృతి చెందాడు. ఈ బాలుడి మృతిపట్ల కుటుంబ సభ్యులు, బంధువులే కాదు సోషల్ మీడియా ఇన్​ఫ్లూయెన్సర్లు, నెటిజన్లు కూడా విషాదంలో మునిగిపోయారు.

Gadwal Bidda Passes Away
Gadwal Bidda Passes Away

By

Published : Feb 7, 2022, 10:59 AM IST

Updated : Feb 7, 2022, 11:28 AM IST

Gadwal Bidda Passes Away : ఒకప్పుడు ఎంత టాలెంట్ ఉన్నా.. గుర్తింపు రావాలంటే చాలా సమయం పట్టేది. కానీ సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడు ఆ కష్టం లేదు. ఓవర్ నైట్​లో ఈజీగా ఫేమస్ అయిపోవచ్చు. కంటెంట్​లో ఎంత కాంట్రవర్సీ ఉంటే.. అంత సులభంగా ఫేమ్ వస్తుంది. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని చాలా మంది సెలబ్రిటీలు పుట్టుకొచ్చారు. కేవలం యువతే కాదు.. ఇలా ఓవర్ నైట్ స్టార్ అయిన వాళ్లలో చిన్నపిల్లలూ ఉన్నారు. అందులో ఒకరే గద్వాల బిడ్డ.. మల్లికార్జున్ రెడ్డి. 'అది కూడా కరెక్టే కదా సార్' అనే డైలాగ్​తో పాపులర్ అయిన ఈ గద్వాల బిడ్డ అనారోగ్యంతో ఆదివారం రోజున మృతి చెందాడు.

వీడియో వైరల్.. ఓవర్ నైట్​లో స్టార్

Social Media Sensation Gadwal Bidda Died : తెలిసో తెలియకో ఓ వర్గంపై మల్లికార్జున్ అనుచిత వ్యాఖ్యలు చేసిన వీడియో వైరల్ అయింది. కాంట్రవర్సీ అంటే సోషల్ మీడియా ప్రియులకు ఎంత ప్రియమో తెలిసిందే గా.. అందుకే ఈ వీడియోను ఇంకాస్త వైరల్ చేశారు. ఇంకేంటి.. ఓవర్ నైట్​లో మల్లికార్జున్ సోషల్ మీడియా స్టార్ అయిపోయాడు. కులవివక్షకు సంబంధించిన వ్యాఖ్యలు చేశారంటూ కామెంట్లు రావడం వల్ల ఈ వీడియోను డిలీట్ చేశారు.

అది కూడా కరెక్టే కదా సార్..

Gadwal Bidda Death : కానీ సదరు వర్గం ఫిర్యాదుతో మల్లికార్జున్​ను మందలించడానికి పోలీసులు అతన్ని స్టేషన్​కు పిలిపించారు. పోలీసులు అతనికి నచ్చజెప్పే సమయంలో.. మల్లికార్జున్ నోటి నుంచి వచ్చిన 'అది కూడా కరెక్టే కదా సార్' అనే డైలాగ్​ కూడా తెగ వైరల్ అయింది. ఆ డైలాగ్​ను వాడని మీమర్ లేరంటే ఆశ్చర్యం లేదు.

మీమ్స్ వైరల్..

Gadwal Bidda Mallikarjun Reddy Passed Away : చిన్నతనం నుంచి ఆస్తమాతో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మల్లికార్జున్ సోషల్‌మీడియాలో చేసే వ్యాఖ్యలు నిత్యం వైరల్‌ అవుతూనే ఉంటాయి. తనకు ఆరోగ్యం సరిగ్గా లేకున్నా తన వాయిస్‌తో నెటిజన్లను ఏదో రకంగా ఎప్పుడూ అలరిస్తూనే ఉంటాడు. తెలిసీ తెలియక అమాయకంగా కనిపిస్తూ మల్లికార్జున్ చేసిన డైలాగ్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. చాలా ట్రోల్స్. వీడియోలు. మీమ్స్​లో మల్లికార్జున్ కనిపిస్తూ ఉంటాడు. చిన్న వయసులోనే మల్లికార్జున్ మీమ్స్ ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.

ఇంకా ఎంతో మంచి భవిష్యత్​ ఉందనుకుంటే.. మల్లికార్జున్ ఇంత చిన్న వయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లడం చాలా బాధగా ఉందంటూ సోషల్ మీడియాలో అనేక పోస్టులు దర్శనమిస్తున్నాయి. అతని మరణం పట్ల కుటుంబం, బంధువులే కాదు.. సోషల్ మీడియా ఇన్​ఫ్లూయెన్సర్లు, నెటిజన్లు విచారం వ్యక్తం చేస్తున్నారు.

Last Updated : Feb 7, 2022, 11:28 AM IST

ABOUT THE AUTHOR

...view details