టాలీవుడ్ స్టార్ కపుల్ సమంత-నాగచైతన్య (Samantha Chaitanya) తాము విడిపోతున్నట్లు ప్రకటించి అభిమానులను షాక్‌కు గురిచేశారు. దశాబ్దకాలంగా ప్రేమ.. నాలుగేళ్ల తమ (CHAYSAM) వైవాహిక బంధానికి స్వస్తి పలకడానికి కారణమేమై ఉంటుందా? అని ఇప్పుడు ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్‌మీడియాలో కొన్ని పోస్టులు దర్శనమిస్తున్నాయి. సామ్, ఆమె స్టైలిష్ట్ జుకల్కర్, నటుడు సిద్దార్థ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అంతటా చర్చనీయాంశంగా మారాయి.
ప్రకటనకు కొన్ని గంటల ముందు సామ్ ఇలా..:
తాము విడిపోతున్నట్లు (CHAYSAM Divorce) ప్రకటించడానికి కొన్ని గంటల ముందు సమంత పెట్టిన ఓ పోస్ట్ (Samantha Instagram) ఇప్పుడు చర్చకు దారి తీసింది. 'నేను నిరాశకు గురైనప్పుడు.. చరిత్రలో ఎప్పుడూ నిజం, ప్రేమే విజయం సాధించాయని గుర్తు చేసుకున్నాను. నియంతలు ఎంతమందైనా ఉండొచ్చు.. కొంతకాలం వాళ్లు అజేయంగా కనిపించవచ్చు. కానీ ఏదో ఒకరోజు వాళ్లు కిందపడిపోక తప్పదు. ఈ విషయాన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను' అంటూ సమంత పోస్ట్ పెట్టారు. అంతేకాకుండా దీనిని వాళ్లమ్మ చెప్పిందని సామ్ (Samantha Viral News) తెలిపారు.
ప్రకటన తర్వాత సిద్ధార్థ్ ..:
చై-సామ్‌ల సంయుక్త ప్రకటన తర్వాత నటుడు సిద్ధార్థ్ చేసిన ఓ ట్వీట్ (Siddharth Tweet Samantha) ఇప్పుడు అంతటా హాట్ టాపిక్‌గా మారింది. 'మోసం చేసేవాళ్లు ఎప్పటికీ అభివృద్ధి చెందరు.. స్కూల్‌లో ఉన్నప్పుడు మా టీచర్ నేర్పించిన పాఠాల్లో ఇది కూడా ఒకటి' అని ఆయన చేసిన ట్వీట్ అందర్నీ షాకయ్యేలా చేస్తోంది.