'గూఢచారి' చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని మురిపించిన అచ్చ తెలుగు ముద్దుగుమ్మ శోభిత ధూళిపాళ. ఇటు దక్షిణాది, అటు ఉత్తరాదిలో వరుస సినిమాలతో జోరు చూపిస్తున్న ఈ భామ.. హాలీవుడ్‌లోనూ అడుగుపెట్టింది.
ఆమె త్వరలోనే 'మంకీమ్యాన్' అనే హాలీవుడ్ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించనుంది. ఈ విషయాన్ని శోభిత అధికారికంగా ప్రకటించింది. 'స్లమ్‌డాగ్ మిలియనీర్' హీరో దేవ్ పటేల్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన తొలి చిత్రమిది.