తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'చిరు' మనసును కదిలించిన పోలీసుతో మెగాస్టార్​

మానసిక పరిస్థితి సరిగా లేని వృద్ధురాలికి ఓ పోలీసు అధికారిణి అన్నం తినిపించే వీడియోను ఇటీవలే ట్విట్టర్​లో షేర్​ చేశారు మెగాస్టార్​ చిరంజీవి. ఆ సంఘటన తన మనసును కదిలించిందన్నారు. ఒడిశాకు చెందిన పోలీసు అధికారిణి శుభశ్రీతో స్వయంగా మాట్లాడి.. తన మానవీయతకు కృతజ్ఞతలు తెలిపారు.

By

Published : May 12, 2020, 2:18 PM IST

So delighted to chat with Shubhasri ji Share video Chiranjeevi
మెగాస్టార్​ మనసు కదిలించిన పోలీసు అధికారిణి

ఓ పోలీసు అధికారిణిలో మాతృత్వం చూశానని, ఆమె వ్యక్తిత్వం తన హృదయాన్ని తాకిందని చెబుతూ అగ్ర కథానాయకుడు చిరంజీవి ఇటీవల ఓ వీడియోను పంచుకున్నారు. మాతృ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు చెబుతూ వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేశారు. 'మన తల్లి గురించి మనం చెప్పుకోవడం గర్వంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. అది మామూలే. అయితే ఈసారి మరో తల్లి గురించి మీ ముందు మాట్లాడుతా..' అంటూ రోడ్డుపక్కన మానసిక పరిస్థితి సరిగ్గాలేక ఉన్న వృద్ధురాలికి అన్నం తినిపించిన ఓ పోలీసు అధికారిణి గురించి చిరు చెప్పారు. ఒడిశాకు చెందిన ఆ పోలీస్‌ అధికారిణి శుభశ్రీతో ప్రత్యేకంగా మాట్లాడిన వీడియోను అభిమానులతో పంచుకున్నారు.

"కొన్ని రోజుల క్రితం మీరు ఒక మతి స్థిమితం లేని మహిళకు భోజనం తినిపిస్తున్న వీడియోను చూశాను. అది నా మనసుని తాకింది. నన్ను చలింపజేసింది. ఆ రోజు నుంచి నేను మీతో మాట్లాడాలని చాలా ప్రయత్నిస్తున్నా. మీరు ఆ వ్యక్తి పట్ల అంత ఆదరణ, మానవీయంగా ఉన్నందుకు కృతజ్ఞతలు తెలియజేయాలనుకున్నా. మీలో ఒక సానుభూతి నిండిన తల్లి హృదయాన్ని చూశాను" అంటూ శుభశ్రీ చేసిన పనికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్‌ అధికారిణి శుభశ్రీ.. చిరుకు ధన్యవాదాలు తెలిపారు.

ఇదీ చూడండి.. మాస్​ సినిమాల ఘనాపాటి.. బోయపాటి

ABOUT THE AUTHOR

...view details