స్లమ్‌డాగ్ మిలియనీర్.. ఆస్కార్ బరిలో నిలిచి ఎనిమిది అవార్డులను గెలుచుకుంది. ముంబయి మురికివాడల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి గుర్తింపు సాధించింది. అయితే ఇందులో జమాల్ చిన్నప్పుడు సెప్టిక్ ట్యాంక్‌లో దూకే సన్నివేశం ఉంది. అది ఎలా చేశారా అని అందరికీ అనుమానంగా కలిగింది. వాస్తవానికి అది మలినం కాదు.
ఆ సన్నివేశం ఎలా తీశారో..! - cinema
'స్లమ్‌డాగ్ మిలియనీర్' చిత్రంలో చిన్న పిల్లాడు సెప్టిక్ ట్యాంక్‌లో దూకే సన్నివేశం చూసి ప్రేక్షకుల హృదయం ద్రవించిపోయింది. ఆ సీన్ ఎలా చిత్రీకరించారా అని ఆశ్చర్యం కలిగింది. కానీ అది వాస్తవానికి మలినం కాదట. నోరూరించే చాక్లెట, పీనట్ బటర్ మిశ్రమం.
![ఆ సన్నివేశం ఎలా తీశారో..!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3525930-thumbnail-3x2-slum.jpg)
ప్రధానపాత్ర జమాల్ చిన్నప్పుడు అమితాబ్ బచ్చన్‌ను చూడాలనే ఆత్రుతతో సెప్టిక్ ట్యాంక్‌లోకి దూకే సన్నివేశం గుర్తుంది కదా? అందులో జమాల్ ఒంటికి అంటుకున్న మలినాన్ని చూస్తే ప్రేక్షకులకే అసహ్యం పుడుతుంది. ఇక షూటింగ్ చేసేటప్పుడు ఎలా భరించారో అనిపిస్తుంది. కానీ చిత్రబృందం మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా లొట్టలేసుకుంటూ మరీ ఆ సన్నివేశాన్ని తీసిందంట. ఎందుకంటే అది దుర్వాసన వచ్చే మలినం కాదు... నోరూరించే చాకొలెట్, పీనట్ బటర్ మిశ్రమం. మేకప్‌తో ఎన్ని అద్భుతాలు చేయొచ్చన్న దానికి ఆ సన్నివేశం ఓ ఉదాహరణగా నిలిచిపోయింది.