తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'సైమా' వేడుక తేదీల్లో మార్పు.. ఆసక్తికరంగా 'నెట్​' ట్రైలర్​

టాలీవుడ్​ నుంచి కొత్త సినిమా కబుర్లు వచ్చేశాయి. హైదరాబాద్​ వేదికగా సెప్టెంబరులో జరగనున్న సైమా అవార్డ్స్​ తేదీల్లో మార్పు జరిగింది. అంతేకాకుండా 'నెట్​' ట్రైలర్​తో పాటు 'కపటనాటక సూత్రధారి', 'డియర్​ మేఘ' సినిమా సెన్సార్​ అప్​డేట్లు ఇందులో ఉన్నాయి.

Slight change in Siima Awards ceremony dates
'సైమా అవార్డ్స్​' వేడుక తేదీల్లో మార్పు.. ఆసక్తికరంగా 'నెట్​' ట్రైలర్​

By

Published : Aug 26, 2021, 2:33 PM IST

సినీ రంగానికి సంబంధించి ప్రతిష్ఠాత్మకంగా భావించే అవార్డుల్లో సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా) ఒకటి. కరోనా కారణంగా గతేడాది ఈ వేడుకలు నిర్వహించలేదు. హైదరాబాద్​ వేదికగా ఈ ఏడాది సెప్టెంబరు 11, 12న నిర్వహించాలని తొలుత నిర్వహించినా.. అనివార్య కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే నిర్వహణ తేదీలను మార్పు చేస్తూ.. గురువారం మరో ప్రకటన విడుదలైంది. సెప్టెంబరు 18, 19 తేదీల్లో వేడుకను జరపనున్నట్లు నిర్వహకులు తెలిపారు.

సైమా అవార్డ్స్​ ప్రకటన

'కపటనాటకం' సెన్సార్​ పూర్తి

సస్పెన్స్​ థ్రిల్లర్​గా తెరకెక్కుతున్న 'కపటనాటక సూత్రధారి' సినిమా ట్రైలర్ ఇటీవలే​ విడుదలై ఆకట్టుకుంటోంది. విజయ్ శంకర్​, సంపత్ కుమార్​, భానుచందర్​, రవిప్రకాశ్​ కీలక పాత్రల్లో నటించగా.. క్రాంతి సైన దర్శకత్వం వహించారు. ఈ సినిమా సెన్సార్​ పూర్తి చేసుకొంది. యూ/ఏ సర్టిఫికేట్​ చేసిన దక్కించుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

'కపటనాటక సూత్రధారి' సెన్సార్​ పోస్టర్​

'నెట్​' ట్రైలర్​

అవికా గోర్​, రాహుల్​ రామకృష్ణ ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం 'నెట్​'. జీ5 ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్​ను గురువారం చిత్రబృందం విడుదల చేసింది.

'డియర్​ మేఘ' సెన్సార్​

మేఘా ఆకాశ్, అరుణ్ అదిత్ ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం 'డియర్ మేఘ'. ఇటీవలే విడుదలైన చిత్ర ట్రైలర్​ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమా సెన్సార్​ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. క్లీన్​ యూ సర్టిఫికేట్​ దక్కించున్న చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అరుణ్ దాస్యం దర్శకత్వం వహించారు.

'డియర్​ మేఘ' సెన్సార్​ పోస్టర్​

ఇదీ చూడండి..జగన్‌, షర్మిల నాపై కోప్పడ్డారు!

ABOUT THE AUTHOR

...view details