తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నెట్​ఫ్లిక్స్​ కోసం భన్సాలీ కొత్త ప్రాజెక్టు! - నెట్​ఫ్లిక్స్​ కోసం భన్సాలీ చిత్రం

బాలీవుడ్ దర్శకనిర్మాత సంజయ్​ లీలా భన్సాలీ తన కొత్త ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. 'హీరా మండి' అనే కథను నెట్​ఫ్లిక్స్​ ఓటీటీ కోసం రూపొందించనున్నారు. వచ్చే ఏడాది చిత్రీకరణ ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్టుకు విభు పూరి దర్శకుడిగా ఎంపికయ్యారని బాలీవుడ్​లో ప్రచారం జరుగుతోంది.

SLB joins hands with Netflix for pet project Heera Mandi?
నెట్​ఫ్లిక్స్​ కోసం భన్సాలీ కొత్త ప్రాజెక్టు!

By

Published : Dec 17, 2020, 12:39 PM IST

బాలీవుడ్​ దర్శకనిర్మాత సంజయ్​ లీలా భన్సాలీ తన కొత్త ప్రాజెక్టు కోసం నెట్​ఫ్లిక్స్​ ఓటీటీతో కలిసి పనిచేయనున్నారని బాలీవుడ్​ వర్గాలు అంటున్నాయి. 'హీరా మండి' అనే కథను ఈ డిజిటల్​ వేదిక కోసం రూపొందించనున్నారని సమాచారం. 2021లో చిత్రీకరణ ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్టుకు విభు పూరి దర్శకుడిగా ఎంపికైనట్లు తెలుస్తోంది. భన్సాలీ తెరకెక్కించిన 'గుజారిష్​' చిత్రానికి మాటల రచయితగా విభు పనిచేశారు.

సంజయ్​ లీలా భన్సాలీ.. ప్రస్తుతం 'గంగూబాయ్​ కతియవాడి' చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. 'హీరా మండి' చిత్రాన్ని భన్సాలీ మార్క్​తో దర్శకుడు విభు పూరి రూపొందించనున్నారట. మయాంక్​ ఆస్టెన్ సూఫీ రచించిన 'ఎ సడన్​ విజిట్​ టూ పాకిస్థాన్: హీరా మండి ద డ్రీమ్​ హోమ్​ ఆఫ్​ ద హోర్స్​' అనే పుస్తకం నుంచి కథను గ్రహించారు. ఈ పుస్తకం వేశ్యల జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ కథను చిత్రీకరించేందుకు భన్సాలీ 2007లో హక్కులను కొనుగోలు చేశారు. అయితే ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి భన్సాలీకి 13 ఏళ్లు పట్టింది. త్వరలోనే నటీనటుల వివరాలను ప్రకటించే అవకాశం ఉంది.

ఇదీ చూడండి:గన్స్​తో వచ్చేసిన అడివి శేష్, విశాల్

ABOUT THE AUTHOR

...view details