సల్మాన్ ఖాన్.. జిమ్ చేస్తూనో, ఫిట్నెస్ ఛాలెంజ్లతోనో సామాజిక మాధ్యమాల్లో యాక్టీవ్‌గా ఉంటాడు. తాజాగా మరో ఫీట్‌తో అభిమానలను అలరించాడు. స్మిమ్మింగ్పూల్లో రివర్స్ డైవ్ చేసి అందరిని ఆశ్చర్య పరిచాడు. 53 ఏళ్ల వయసులో పాతికేళ్ల కుర్రాడిలా నీళ్లలో దూకాడు.
వయసు పెరిగినా.. జోరు తగ్గించని సల్మాన్! - feat
స్విమ్మింగ్ పూల్లో రివర్స్ డైవ్ చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్. 53 ఏళ్ల వయసులో సల్మాన్ చేసిన ఫీట్‌కు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
సల్మాన్
పూల్ పక్కన ఉన్న రాళ్లపైకి ఎక్కి మరీ దూకుతూ అలరించాడు కండల వీరుడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. సల్మాన్ చేసిన ఫీట్‌కు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. 53 ఏళ్లా.. కాదు 25 అంటూ విశేషంగా స్పందిస్తున్నారు.
ప్రస్తుతం సల్మాన్ 'భారత్' సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. జూన్ 5న విడుదలైన ఈ చిత్రం 200 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ చిత్రంలో కత్రినా కైఫ్, దిషా పటానీ కథానాయికలు. జాకీ ష్రాఫ్, సోనాలి కులకర్ణి కీలకపాత్రలు పోషించారు.