తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'స్కై లాబ్​' ఫస్ట్​లుక్​.. ఉపరాష్ట్రపతితో విశాల్​ భేటీ - వెంకయ్యనాయుడు విశాల్​

నాసా ప్రయోగించిన స్కై లాబ్ వల్ల​ భూమిపై ఉన్న బండ లింగంపల్లిలోని ముగ్గురు జీవితాల్లో ఎలాంటి పరిణామాలు జరిగాయి? అనే కథతో రూపొందిన చిత్రం 'స్కై లాబ్​'. సత్యదేవ్​(Satyadev Kancharana), నిత్యామేనన్​(Nithya Menen), రాహుల్​ రామకృష్ణ ప్రధానపాత్రల్లో నటించిన చిత్ర టైటిల్​ ఫస్ట్​లుక్​ను హీరోయిన్​ తమన్నా విడుదల చేసింది. మరోవైపు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో(Venkaiah Naidu) కోలీవుడ్​ హీరో విశాల్​(Vishal) భేటీ అయ్యారు.

Skylab telugu movie firstlook - Vishal meets Vice President Venkaiah Naidu
'స్కై లాబ్​' ఫస్ట్​లుక్​.. ఉపరాష్ట్రపతితో విశాల్​ భేటి

By

Published : Jul 12, 2021, 8:31 AM IST

Updated : Jul 12, 2021, 9:39 AM IST

అమెరికా స్పేస్‌ స్టేషన్‌ నాసా ప్రయోగించిన స్కై లాబ్‌ భూమిపై పడుతుందని.. దాంతో భూమి నాశనమైపోతుందని అప్పట్లో విస్తృతంగా ప్రచారం జరిగింది. అప్పుడు ఏం జరుగుతుందో అని ప్రపంచమంతా ఊపిరి బిగపట్టి ఎదురు చూసింది. ఆ స్కైలాబ్‌.. మన బండ లింగంపల్లి అనే ఊళ్లో ఉన్న గౌరి, ఆనంద్‌, రామారావు అనే వ్యక్తుల జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపించింది? వారి జీవితాల్లో ఎలాంటి పరిణామాలు జరిగాయనే విషయాలతోనే 'స్కైలాబ్‌' రూపొందింది.

'స్కై లాబ్​' ఫస్ట్​లుక్

సత్యదేవ్‌(Satyadev Kancharana), నిత్యమేనన్‌(Nithya Menen), రాహుల్‌ రామకృష్ణ ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రమిది. విశ్వక్‌ కందెరావ్‌ దర్శకత్వం వహించారు. బైట్‌ ఫ్యూచర్స్‌, నిత్యమేనన్‌ కంపెనీ సంయుక్తంగా రూపొందిస్తున్నాయి. పృథ్వీ పిన్నమరాజు నిర్మాత. 1979 నేపథ్యంలో సాగే ఈ సినిమా పేరును, ఫస్ట్‌లుక్‌ను ప్రముఖ నాయిక తమన్నా విడుదల చేశారు.

ఉపరాష్ట్రపతితో భేటి

భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో(M. Venkaiah Naidu) కోలీవుడ్​ నటుడు విశాల్‌(Vishal) భేటీ అయ్యారు. తన సోదరితో పాటు వెళ్లి ఉపరాష్ట్రపతిని కలిసిన విశాల్‌ పలు అంశాలను ఆయనతో చర్చించారు. సమాజ సేవ కోసం ఏర్పాటు చేసిన ట్రస్టు గురించి ఆయనతో మాట్లాడానని విశాల్‌ అన్నారు.

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో విశాల్​ భేటీ
వెంకయ్యనాయుడుతో విశాల్​, ఆయన సోదరి

వెంకయ్య నాయుడుతో విలువైన సమయం గడిపానని, ఆయనతో మాట్లాడటం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఆయనకు ఆ దేవుడు మంచి ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకుంటున్నానని అన్నారు. ట్విటర్‌ వేదికగా ఈ విషయాన్ని విశాల్‌ వెల్లడించారు. వెంకయ్యనాయుడుతో కలిసి దిగిన ఫొటోలను షేర్​ చేశారు.

ఇదీ చూడండి..'ఆ హీరో కోసమే కథ వినకుండా ఓకే చెప్పేశా!'

Last Updated : Jul 12, 2021, 9:39 AM IST

ABOUT THE AUTHOR

...view details