Vicky Katrina Wedding: బాలీవుడ్ ప్రేమ జంట కత్రినా కైఫ్.. విక్కీ కౌశల్ డిసెంబర్ 9న వివాహబంధంతో ఒక్కటికాబోతున్నారు. ప్రీ వెడ్డింగ్ వేడుకలు మొదలైపోయాయి. ఈ నేపథ్యంలోనే రాజస్థాన్‌లోని వివాహ వేదిక సిక్స్‌సెన్సెస్ ఫోర్ట్ భర్వారా దీప కాంతులతో వెలిగిపోతోంది. ఎరుపు, పసుపు రంగులలో ఆద్యంతం ఆకట్టుకుంటోంది.
Vicky Katrina Wedding: ప్రీ వెడ్డింగ్ వేడుకలు షురూ.. కాంతులీనుతున్న భర్వారా కోట - విక్కీ కౌశల్ కత్రినా కైఫ్
Vicky Katrina Wedding: ఎంతో గోప్యంగా జరుగుతున్నా.. అందరి చూపు బాలీవుడ్ ప్రేమ జంట కత్రినా కైఫ్.. విక్కీ కౌశల్ వివాహ కార్యక్రమంపైనే ఉంది. వివాహ వేదిక అయిన రాజస్థాన్‌లోని సిక్స్‌సెన్సెస్ ఫోర్ట్ భర్వారా దీప కాంతులతో వెలిగిపోతోంది.
విక్కీ కౌశల్ కత్రినా కైఫ్
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వేదికకు కుటుంబ సభ్యులతో కలిసి కత్రినా చేరుకున్నట్లు తెలుస్తోంది. నీతా అంబానీ, ఆమె కూతురు ఇషా అంబానీ కూడా వేడుకకు హాజరైనట్లు సమాచారం. అంతకుముందు ధూమ్ 3 డైరెక్టర్ విజయ్ కృష్ణా ఆచార్య, యాక్టర్ శార్వరి జైపూర్ విమానాశ్రయంలో కనిపించారు. నేహా ధూపియా, ఆంగడ్ బేడీ, రాధికా మదన్ కూడా వెళ్లినట్టు తెలుస్తోంది.
ఇదీ చూడండి:katrina vicky wedding: ఇదేందయ్యా ఇది.. పెళ్లి వీడియోకు 100 కోట్ల ఆఫరా?