ఇతర సినిమాలతో పోలిస్తే, స్పోర్ట్స్ డ్రామా చిత్రాలకు మంచి క్రేజ్ ఉంటుంది. భావోద్వేగాల మిళితంగా సాగే ఈ చిత్రాలు ఆద్యంతం అలరిస్తాయి. ఇక ఆఖరి పోరు ఎపిసోడ్ వెండితెరపై చూస్తుంటే కొందరికి కన్నీళ్లు కూడా ఆగవు. కేవలం వినోదాన్ని పంచడమే కాదు, స్ఫూర్తిని కూడా నింపుతాయి స్పోర్ట్స్ డ్రామా చిత్రాలు.
ఈ స్పోర్ట్స్ డ్రామా చిత్రాలపై ఓ లుక్కేయండి! - స్పోర్ట్స్ మూవీస్ అమెజాన్ ప్రైమ్
స్పోర్ట్స్ డ్రామా చిత్రాలకు సినీప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటుంది. కేవలం వినోదాన్ని పంచడమే కాదు, స్ఫూర్తిని కూడా నింపుతాయి. అలాంటి చిత్రాలు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అలరిస్తున్నాయి. ఆ మూవీస్ ఏంటో చూద్దాం..
స్పోర్ట్స్ మూవీస్
అలాంటి ఆరు చిత్రాలు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అలరిస్తున్నాయి. 'సైనా', 'సార్పట్ట', 'చక్ దే ఇండియా', 'సుల్తాన్', 'తూఫాన్', 'ఇన్‌సైడ్ ఎడ్జ్' చిత్రాలకు సంబంధించిన ఆసక్తికర సన్నివేశాలను అమెజాన్ ప్రైమ్ యూట్యూబ్‌లో పంచుకుంది. ఆద్యంతం అలరించేలా సాగే ఆ వీడియోను మీరూ చూసేయండి.
ఇదీ చూడండి: 'భీమ్లా నాయక్' ట్రీట్.. 'కార్తికేయ 2' హీరోయిన్ ఖరారు