తెలుగు దర్శకులు చెబుతున్న కథలకు ఫిదా అవుతున్నారు తమిళ కథానాయకులు. ఇప్పటికే విజయ్(Vijay) - వంశీ పైడిపల్లి(Vamshi Paidipally), ధనుష్(Dhanush) - శేఖర్ కమ్ముల(Sekhar Kammula) కాంబినేషన్లలో సినిమాలు ఖరారు అయ్యాయి. తెలుగు దర్శకులు చెప్పిన కథలు నచ్చడం వల్ల ఆ ఇద్దరూ ఇప్పటికే సినిమాలు చేయడానికి పచ్చజెండా ఊపేశారు. అదే తరహాలోనే మరో తమిళ కథానాయకుడు శివకార్తికేయన్(Sivakarthikeyan) టాలీవుడ్లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు.
'జాతిరత్నాలు' దర్శకుడితో తమిళ హీరో చిత్రం! - శివకార్తికేయన్
'జాతిరత్నాలు'(Jathi Ratnalu) చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడు అనుదీప్(Anudeep Kv).. ప్రస్తుతం ఓ తమిళ స్టార్ కథానాయకుడితో సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు. అనుదీప్ చెప్పిన కథకు ఆ హీరో ఫిదా అయినట్లు టాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది.
'జాతిరత్నాలు'(Jathi Ratnalu) సినిమాతో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించి విజయాన్ని అందుకున్న యువ దర్శకుడు అనుదీప్(Anudeep Kv).. శివ కార్తికేయన్‌తో పనిచేయనున్నారని సమాచారం. ఈ కథ ఓ ద్విభాషా చిత్రంగా తెరకెక్కే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి మధ్య ప్రస్తుతం కథా చర్చలు కొనసాగుతున్నట్టు తెలిసింది. ఈ కలయికలో సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ నిర్మించనుంది. ఇదే సంస్థలోనే ధనుష్ - శేఖర్ కమ్ముల సినిమా రూపొందనుంది.
ఇదీ చూడండి..జాన్వీ 'భయ్యా' అని పిలిస్తే.. అర్జున్ రియాక్షన్