తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ధనుష్​ సినిమా శివకార్తికేయన్ చేతిలోకి..! - Sivakarthikeyan’s new film titled Doctor, see first-look poster

తమిళ నటుడు శివ కార్తికేయన్ కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్ర టైటిల్​ను ప్రకటించింది చిత్రబృందం.

sivakarthikeyan
శివ

By

Published : Dec 4, 2019, 10:41 AM IST

కమర్షియల్‌ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న శివ కార్తికేయన్‌.. ఏకకాలంలో మూడు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పుడు 'కోలమావు కోకిల' ఫేమ్‌ నెల్సన్‌ దర్శకత్వంలో ఓ సినిమాకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాడు. ఈ మూవీకి 'డాక్టర్‌' అని పేరు పెట్టారు. ఇందులో శివ వైద్యుడిగా నటించనున్నట్లు సమాచారం. కేజేఆర్‌ స్టూడియోస్‌ దీనిని నిర్మిస్తోంది. త్వరలోనే చిత్రీకరణ మొదలు కానుంది.

ఈ సినిమాలో 'గ్యాంగ్‌ లీడర్‌' ఫేమ్‌ ప్రియాంకా మోహన్ కథానాయిక. అనిరుధ్‌ సంగీతం సమకూర్చుతున్నాడు. ఇతర నటీనటులు, సాంకేతిక కళాకారుల ఎంపిక పనులు జరుగుతున్నాయి.

సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో ధనుష్‌ హీరోగా కొన్నేళ్ల క్రితం 'డాక్టర్స్‌' అనే చిత్రం మొదలైంది. సోనియా అగర్వాల్‌ కథానాయికగా నటించనున్నట్లు మొదట ప్రకటించారు. అయితే కొన్ని కారణాలతో ఆ సినిమాను ఆపేశారు. ఇప్పుడు 'డాక్టర్స్‌'లో 'ఎస్‌'ను తొలగించి 'డాక్టర్‌' అనే చిత్రంలో నటిస్తున్నాడు శివకార్తికేయన్‌.

ఇవీ చూడండి.. విక్రమ్‌ కొత్త చిత్రం పేరు 'అమర్‌'..?

ABOUT THE AUTHOR

...view details