Shivashankar master Alitho saradaga: కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కరోనాతో పోరాడుతూ ఆదివారం కన్నుమూశారు. సినీ పరిశ్రమకు ఆయన సేవలు మరవలేనివని పలువురు ప్రముఖులు వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా అలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొని ఆయన పంచుకున్న కొన్ని విషయాలు మీకోసం..
వెన్నముక విరిగింది..
"మా ఇల్లు చాలా పెద్దది. నాకు ఏడాదిన్నర వయసున్నప్పుడు మా పెద్దమ్మ నన్ను ఒడిలో కూర్చోబెట్టుకుని అరుగు మీద కూర్చుని పొరిగింటివారితో కబుర్లు చెప్పేది. ఓరోజు అలా కూర్చున్న సమయంలో అనుకోకుండా ఓ ఆవు.. వారి వైపుగా పరుగులు తీసింది. దీంతో ఎక్కడ ఆవు తన మీదకు వస్తుందోనని మా పెద్దమ్మ ఇంట్లోకి పరుగెత్తింది. అప్పుడు నేను తన చేతుల్లోనుంచి గుమ్మం మీద పడిపోయా. వెన్నముక విరిగిపోయింది. నెల రోజుల పాటు జ్వరం తగ్గలేదు. ఏ ఆసుపత్రిలో చూపించినా నయం కాలేదు," అని శివశంకర్ మాస్టర్ చెప్పుకొచ్చారు.