తెలంగాణ

telangana

ETV Bharat / sitara

శివశంకర్​ మాస్టర్​ అంత్యక్రియలు పూర్తి - siva shankar master dance

ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ అంత్యక్రియలు.. హైదరాబాద్​లో ఆదివారం పూర్తయ్యాయి. అంతకు ముందు మాస్టర్ పార్థివ దేహాన్ని హీరో రాజశేఖర్ సందర్శించారు.

siva shankar master
శివశంకర్​ మాస్టర్​

By

Published : Nov 29, 2021, 2:21 PM IST

కరోనాతో పోరాడుతూ మృతి చెందిన ప్రముఖ నృత్యదర్శకుడు శివశంకర్ మాస్టర్ కు కథానాయకుడు రాజశేఖర్ నివాళులర్పించారు. మణికొండలోని పంచవటి కాలనీలో నివాసానికి చేరుకున్న రాజశేఖర్.. శివశంకర్ మాస్టర్ కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు.

శివశంకర్ మాస్టర్ తన ఎన్నో చిత్రాలకు నృత్యదర్శకుడిగా పనిచేశారని, ఆయన లేని లోటు చిత్ర పరిశ్రమలో తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. శివశంకర్ మాస్టర్ కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని రాజశేఖర్ ప్రార్థించారు.

అనంతరం కుటుంబసభ్యులు శివశంకర్ మాస్టర్ భౌతికకాయానికి ఫిల్మ్​నగర్ లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. ఆయన చిన్నకుమారుడు అజయ్ తండ్రికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. మరోవైపు శివశంకర్ పెద్ద కుమారుడు విజయ్ కరోనాతో పోరాడుతూ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details