సినిమా టికెట్ ధరల విషయంలో తన పేరును ప్రస్తావిస్తూ ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యాలపై ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తనకు సామాజిక మాద్యమాల్లో ఎలాంటి ఖాతాలు లేవని, హారికా హాసినీ, ఫార్చున్ ఫర్ సినిమాస్ పేరుతో ఉండే ట్విట్టర్ ఖాతాల ద్వారా మాత్రమే అధికారికంగా తన అభిప్రాయాలను వెల్లడిస్తానని స్పష్టం చేశారు.
తన పేరుతో సినిమా టికెట్ ధరలపై వచ్చిన అభిప్రాయాలను నమ్మవద్దని మంత్రి పేర్నినానితోపాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్, ఏపీ సమాచార ప్రసార శాఖను కోరారు. ప్రతి పాఠశాలలో ఒకటే ఫీజు, ప్రతి ఆస్పత్రిలోనూ ఒకటే బిల్లు ఎందుకు పెట్టరు, పేదవాడికి విద్య, వైద్యం కంటే సినిమా ఎక్కువా అంటూ త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరుతో చేసిన ట్వీట్ చేశారు.