తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మహేశ్​తో కుమార్తె సితార స్విమ్మింగ్ రేస్ - మహేశ్ కీర్తి సురేశ్

నాన్నతో తొలిసారి స్మిమ్మింగ్ రేసులో పాల్గొన్న సితార.. ఆ సమయాన్ని ఎంతో ఎంజాయ్​ చేశానని తెలిపింది. ఆ వీడియోను ఇన్​స్టాలో పంచుకుంది.

మహేశ్​తో కుమార్తె సితార స్విమ్మింగ్ రేస్
మహేశ్​తో కుమార్తె సితార

By

Published : Jun 27, 2020, 2:12 PM IST

సూపర్​స్టార్ మహేశ్​బాబుతో కుమార్తె సితార.. తొలిసారి స్మిమ్మింగ్ రేస్​లో పాల్గొంది. ఈ విషయాన్ని తన ఇన్​స్టాలో పంచుకుందీ చిన్నారి. ఈత కొట్టడాన్ని చాలా ఎంజాయ్ చేశానని, ఇదే తన తొలి రేస్ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్​ అయింది.

లాక్​డౌన్​తో ఇంట్లోనే ఉన్న మహేశ్​.. కుటుంబంతో కలిసి సమయాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు.. అతడి భార్య నమ్రత ఎప్పటికప్పుడూ పోస్ట్ చేస్తూనే ఉన్నారు.

ప్రస్తుతం మహేశ్ 'సర్కారు వారి పాట' సినిమాలో నటిస్తున్నారు. సూపర్​స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఫస్ట్​లుక్ ఆకట్టుకుంటోంది. ఇందులో హీరోయిన్​గా కీర్తిసురేశ్ నటిస్తుండగా, పరశురామ్​ దర్శకత్వం వహిస్తున్నారు. తమన్ సంగీత దర్శకుడు. జీఎంబీ ఎంటర్​టైన్​మెంట్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థ, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

మహేశ్​బాబు 'సర్కారు వారి పాట' ఫస్ట్​లుక్

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details