తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అంతర్జాతీయ చిత్రంతో 'భీమ్లానాయక్' సినిమాటోగ్రాఫర్ - అంతర్జాతీయ స్థాయిలో తమర సినిమా

ఇప్పటికే పలు సినిమాలకు(cinematographer ravi) దర్శకత్వం వహించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సినిమాటోగ్రాఫర్​ రవి కె.చంద్రన్(bheemlanayak cinematographer)​.. ఈ సారి అంతర్జాతీయ స్థాయిలో సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు. 'తమర' అనే క్రేజీ ప్రాజెక్టును రూపొందించబోతున్నట్లు ప్రకటించారు.

bheemlanayak
భీమ్లానాయక్​

By

Published : Nov 6, 2021, 8:47 AM IST

తన కెమెరాతో(cinematographer ravi) ఎంతోమందిని స్టార్లను అందంగా చూపించి, ఎన్నో అద్భుత దృశ్యాల్ని వెండితెరపై ఆవిష్కరించి భారతీయ చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సినిమాటోగ్రాఫర్‌ రవి కె.చంద్రన్‌(bheemlanayak cinematographer). పలు సినిమాలతో మంచి దర్శకుడిగానూ నిరూపించుకున్నారు. ఇప్పుడు మరోసారి 'స్టార్ట్‌.. కెమెరా.. యాక్షన్‌' చెప్పేందుకు సిద్ధమయ్యారు. అంతర్జాతీయ స్థాయిలో 'తమర' అనే క్రేజీ ప్రాజెక్టును తెరకెక్కించనున్నారు.

ఫ్రాన్స్‌కు చెందిన ఓ నిర్మాణ సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ మేరకు విడుదల చేసిన పోస్టర్‌ను చూస్తుంటే ఇది నాయికా ప్రాధాన్యమున్న చిత్రంగా అనిపిస్తుంది. ఈ ఇంటర్నేషనల్‌ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. 'భరత్‌ అనే నేను' చిత్రంతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన రవి కె. చంద్రన్‌ ప్రస్తుతం 'భీమ్లా నాయక్'(pawankalyan bheemlanayak) సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ఈ సినిమానీ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తోంది. పవన్‌ కల్యాణ్‌, రానా కథానాయకులుగా సాగర్‌ కె. చంద్ర తెరకెక్కిస్తున్నారు.

ఇదీ చూడండి: 'భీమ్లా నాయక్' కూడా సంక్రాంతి రేసు నుంచి ఔట్!

ABOUT THE AUTHOR

...view details