తెలంగాణ

telangana

ETV Bharat / sitara

దీపిక పదుకుణె హిట్​ సాంగ్​కు సితార డ్యాన్స్ - mahesh babu new cinema

బాలీవుడ్​ హిట్​ గీతం 'నగాడ సంగ్‌ డోలు భాజే' గీతానికి అద్భుతంగా డ్యాన్స్ చేస్తూ అలరిస్తోంది మహేశ్​బాబు కూతురు సితార. ఆ వీడియో ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది.

దీపిక హిట్​ సాంగ్​కు సితార డ్యాన్స్

By

Published : Oct 27, 2019, 2:30 PM IST

సూపర్‌స్టార్‌ మహేశ్​బాబు కుమార్తె సితార.. బాలీవుడ్​ హీరోయిన్ దీపిక పదుకుణె పాటకు డ్యాన్స్‌ చేసింది.'నగాడ సంగ్‌ డోలు భాజే' అంటూ సాగే ఈ గీతానికి అద్భుతంగా చేస్తూ వీక్షకులను కట్టిపడేసింది. ఈ వీడియోను మహేశ్ సతీమణి నమ్రత ఇన్​స్టాలో పంచుకుంది.

'మీ అందరికీ దీపావళి సందర్భంగా చిన్న ట్రీట్‌. తన కొత్త గాగ్రాను ధరించి డ్యాన్స్‌ చేస్తున్న సితార. ఈ దీపావళి మీకు మరిన్ని సంతోషాలను అందించాలి' -ఇన్​స్టాలో నమ్రత

ఇంతకు ముందు ఓసారి మహేశ్​ 'మహర్షి' సినిమాలోని పాలపిట్ట సాంగ్​కు నృత్యం చేసింది. అదే విధంగా సొంతంగా యూట్యూబ్​ ఛానెల్​ను ప్రారంభించి, అందులోనూ వీడియోలు పంచుకుందీ చిన్నారి.

ఇది చదవండి:పాలపిట్ట పాటకు సితార కిరాక్​ డ్యాన్స్​

ABOUT THE AUTHOR

...view details