Shyam Singha Roy : సిరివెన్నెల విడియో వెర్షన్ విడుదల - sirivennela video song from shyam singha roy
రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో నాని నటించిన 'శ్యామ్ సింగరాయ్' ప్రేక్షకుల మెప్పు పొందుతోంది. సినిమా... కావ్యంలా ఉందంటూ విమర్శకులు ప్రశంసిస్తున్నారు. తాజాగా ఈ చిత్రబృందం సిరివెన్నెల పాట విడియో వెర్షన్ను యూ ట్యూబ్లో విడుదల చేసింది.

sirivennela song
"సినిమా బాగుందని ఒకటి రెండు లైన్లలో చెప్పడం లేదు. ఓ ప్రేమ లేఖలా రాస్తున్నారు. అదే మాకు పెద్ద సక్సెస్ అనిపిస్తోంది" అన్నారు కథానాయకుడు నాని. ఆయన నటించిన చిత్రం 'శ్యామ్ సింగరాయ్' ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కించారు. వెంకట్ బోయనపల్లి నిర్మాత. సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ కథానాయికలు. ఇటీవలే విజయోత్సవ వేడుకని నిర్వహించిన చిత్రబృందం తాజాగా ఈ చిత్రబృందం సిరివెన్నెల పాట విడియో వెర్షన్ను యూ ట్యూబ్లో విడుదల చేసింది.