shyam singha roy: సాహిత్య, సంగీత అభిమానులు దివంగత సిరివెన్నెల సీతారామశాస్త్రిని పాటల రూపంలో చూసుకుంటున్నారు. ఆయన కలం నుంచి జాలువారిన అక్షరాల్ని గుర్తుచేసుకుంటూ సిరివెన్నెలను స్మరించుకుంటున్నారు. 'సిరివెన్నెల' చిత్రంతో ఆయన సినీ పాటల ప్రయాణం ప్రారంభమైంది. చివరిగా 'శ్యామ్ సింగరాయ్' చిత్రం కోసం ఆయన రెండు పాటలు రాశారు. అందులో ఒకటి మంగళవారం విడుదలైంది. ఇదే ఆయన రాసిన ఆఖరి పాటని చిత్ర బృందం వెల్లడించింది.
Sirivennela: 'సిరివెన్నెల' చివరిగీతం విడుదల.. 'శ్యామ్ సింగరాయ్'లో.. - నాని
shyam singha roy: దివంగత సిరివెన్నెల సీతారామశాస్త్రి ప్రాణం పోసిన ఆఖరి పాట విడుదలైంది. నాని నటించిన 'శ్యామ్ సింగరాయ్' కోసం ఈ పాటను రాశారు సిరివెన్నెల.
shyam singha roy
ఈ గీతం 'సిరివెన్నెల' అంటూ సాగడం విశేషం. మిక్కీ జె. మేయర్ స్వరాలు అందించిన ఈ పాటని అనురాగ్ కులకర్ణి ఆలపించారు. నాని కథానాయకుడిగా దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ తెరకెక్కిస్తున్న చిత్రమిది. సాయి పల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ కథానాయికలు. ఇందులో నాని రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమా డిసెంబరు 24న ప్రేక్షకుల ముందుకురానుంది.
ఇదీ చూడండి:'సిరివెన్నెల లేని తెలుగు సినిమా పాటలు ఊహించడం కష్టం'