sirivennela sitaramasastry lastrites: అనారోగ్యంతో మరణించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి అంత్యక్రియలు పూర్తయ్యాయి. అభిమానులతో పాటు సినీ ప్రముఖుల హాజరై, ఆయనకు అశ్రునయనాలతో వీడ్కోలు పలికారు.
Sirivennela live: సిరివెన్నెల సీతారామశాస్త్రి అంత్యక్రియలు పూర్తి - సిరివెన్నెల తనికెళ్ల భరణి
14:26 December 01
12:16 December 01
మహాప్రస్థానం చేరుకున్న సిరివెన్నెల అంతిమయాత్ర
కాసేపట్లో సిరివెన్నెల సీతారామశాస్త్రి అంత్యక్రియలు
సిరివెన్నెల అంత్యక్రియలకు హాజరైన గద్దర్
11:32 December 01
హైదరాబాద్: సిరివెన్నెల సీతారామశాస్త్రి అంతిమయాత్ర
ఫిల్మ్‌ఛాంబర్ నుంచి మహాప్రస్థానం వరకు అంతిమయాత్ర
అంతిమయాత్రలో పాల్గొన్న సినీ, రాజకీయ ప్రముఖులు
అంతిమయాత్రకు భారీగా తరలివచ్చిన అభిమానులు
కాసేపట్లో మహాప్రస్థానంలో సిరివెన్నెల అంత్యక్రియలు
11:32 December 01
సిరివెన్నెల భౌతికకాయానికి నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్, పవన్ కల్యాణ్
నా ఆవేదనను కూడా సిరివెన్నెల కలంతోనే వ్యక్తపరిస్తే బాగుండేది: ఎన్టీఆర్
సిరివెన్నెల కలం ఆగినా.. ఆయన పాటలు చిరస్మరణీయం: ఎన్టీఆర్
సిరివెన్నెల పాటలు భవిష్యత్ సాహిత్యానికి బంగారుబాట: ఎన్టీఆర్
తెలుగు సాహిత్యంపై సిరివెన్నెల చల్లని చూపు ఉండాలి: ఎన్టీఆర్
సిరివెన్నెల భౌతికకాయానికి నివాళులర్పించిన నాగబాబు, దేవీశ్రీప్రసాద్, శ్రీకాంత్
10:42 December 01
చిత్ర పరిశ్రమకు తీరని లోటు: రాజశేఖర్
"సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆయన గురించి చెప్పేంత గొప్ప వ్యక్తిని కాదు. నేను నటించిన 'శ్రుతిలయలు' సినిమాకు సీతారామశాస్త్రి పాటలు రాశారు. ప్రతి పదంలో సముద్రమంత లోతు ఉంది. ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు" అని సినీ నటుడు రాజశేఖర్ అన్నారు
10:42 December 01
సీతారామశాస్త్రి భౌతికకాయానికి నాగార్జున నివాళి
ఫిల్మ్ ఛాంబర్ అభిమానుల సందర్శనార్థం ఉంచిన 'సిరివెన్నెల సీతారామశాస్త్రి భౌతికకాయానికి అగ్ర కథానాయకుడు నాగార్జున నివాళులర్పించారు. "సీతారామశాస్త్రిగారితో స్నేహం ఎప్పటి నుంచో ఉంది. ఎప్పుడు వెళ్లి కలిసినా 'మిత్రమా ఏం చేస్తున్నావు' అంటూ ఆప్యాయంగా పిలిచేవారు. 'తెలుసా.. మనసా' పాటను ఆయన పక్కన ఉండి రాయించుకున్నాను. నాన్నగారితో కలిసి చేసిన సినిమాలో 'ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా' పాట కూడా శాస్త్రిగారే రాశారు. స్వర్గంలో కూడా దేవుళ్లకు ఇవే పాటలు, మాటలు వినిపిస్తారని అనుకుంటున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి" -సినీ నటుడు నాగార్జున
09:19 December 01
సిరివెన్నెలతో చివరగా మాట్లాడిన వ్యక్తి నేనే: చిరంజీవి
"చాలా చాలా దురదృష్టకరం. ఆయనతో చివరగా మాట్లాడిన వ్యక్తి నేనే. అది నా అదృష్టం. ఆ తర్వాత ఆయన ఫోన్ ఆఫ్ చేసి ఆస్పత్రిలో చేరారు. మంచి చికిత్స కోసం చెన్నై తీసుకెళ్తానని చెప్పాను. ఇద్దరం ఒకే సంవత్సరంలో పుట్టాం. ఎప్పుడూ నన్ను మిత్రమా అని పిలిచేవారు. బాలుగారు, సిరివెన్నెల చనిపోవడం చిత్రపరిశ్రమకు తీరనిలోటు. మంచి మిత్రుడిని కోల్పోయాను. సిరివెన్నెల స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరు. నా కోసం ప్రత్యేకంగా పాటలు రాసేవారు. 'నడిచే నక్షత్రం' అంటూ నాకోసమే రాశానని అనేవారు. ఆయన జ్ఞాపకార్థం మేం ఏదో ఓ కార్యక్రమం నిర్వహిస్తాం" అని హీరో చిరంజీవి చెప్పారు.
09:16 December 01
సిరివెన్నెలకు అల్లు అర్జున్ నివాళి
సిరివెన్నెల భౌతికకాయానికి హీరో అల్లు అర్జున్ నివాళి అర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. "శాస్త్రిగారు నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. నా కుటుంబసభ్యుల తర్వాత కాళ్లకు నమస్కారం చేసే అతి తక్కువమంది వ్యక్తుల్లో సీతారామశాస్త్రి ఒకరు. ఆయన పాటలు చిరస్థాయిగా నిలిచిపోతాయి" అని అల్లు అర్జున్ అన్నారు.
09:08 December 01
"తెలుగు భాషకు, సాహిత్యానికి సిరివెన్నెల భూషణం. సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న మహానుభావుడు సిరివెన్నెల. ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు" అని బాలకృష్ణ అన్నారు.
08:10 December 01
సినీ నటుడు, రచయిత తనికెళ్ల భరణి.. సిరివెన్నెల భౌతికకాయానికి నివాళి అర్పించారు. ఈ క్రమంలోనే భావోద్వేగానికి లోనై కన్నీటి పర్యంతమయ్యారు. ఆయనను త్రివిక్రమ్ ఓదార్చారు. తనికెళ్లతో పాటే దర్శకులు విజయ్ భాస్కర్, మారుతి, నటుడు రావు రమేశ్, సంగీత దర్శకుడు మణిశర్మ.. సిరివెన్నెలకు నివాళులర్పించారు.
08:08 December 01
నా కెరీర్ ప్రారంభం నుంచి సిరివెన్నెలతో పనిచేశాను. 'స్వర్ణకమలం' నుంచి మొన్న వచ్చిన 'నారప్ప' వరకు ఆయనతో ఎంతో సన్నిహితంగా ఉండేవాడిని. సాహిత్య రంగంలో మనం ఓ లెజెండ్‌ను కోల్పోయాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి- విక్టరీ వెంకటేశ్
06:43 December 01
సిరివెన్నెల భౌతికకాయానికి రాజమౌళి, కీరవాణి నివాళి
అభిమానుల సందర్శనార్థం హైదరాబాద్‌లోని ఫిల్మ్‌ఛాంబర్‌లో సిరివెన్నెల భౌతికకాయాన్ని ఉంచారు. పలువురు సినీ ప్రముఖులు ఆయనకు నివాళులర్పిస్తున్నారు. సిరివెన్నెల భౌతికకాయానికి డైరెక్టర్ రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి నివాళులర్పించారు. నేడు(బుధవారం) మహాప్రస్థానంలో మధ్యాహ్నం 12 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో సిరివెన్నెల అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
06:40 December 01
డైరెక్టర్ వివి వినాయక్ సంతాపం
06:31 December 01
హీరో మహేశ్‌బాబు ట్వీట్
సిరివెన్నెల మరణంపై హీరో మహేశ్‌బాబు ట్వీట్ చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సిరివెన్నెలను చాలా మిస్ అవుతామని అన్నారు.