Siri vennela seetharama sastry health condition: ఇటీవల అస్వస్థతకు గురైన ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆరోగ్యంపై కిమ్స్ ఆస్పత్రి ప్రత్యేక హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. న్యూమోనియా కారణంగా నవంబర్ 24న సిరివెన్నెల సికింద్రాబాద్ లోని తమ ఆస్పత్రిలో చేరారని వెల్లడించిన కిమ్స్ వైద్యులు.. ప్రస్తుతం ఐసీయూలో ఉంచి ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
గీత రచయిత సిరివెన్నెల హెల్త్ బులిటెన్ విడుదల - సిరివెన్నెల సీతారమశాస్త్రి ఆరోగ్య పరిస్థితి
Siri vennela seetharama sastry health condition: అస్వస్థకు గురై కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి హెల్త్ బులిటెన్ విడుదల చేశారు వైద్యులు. సిరివెన్నెల న్యూమోనియాతో బాధపడుతున్నట్లు తెలిపిన వైద్యులు.. ఆయన్ను వైద్యనిపుణుల బృందం పరిశీలిస్తోందని చెప్పారు.

గీత రచయిత సిరివెన్నెల హెల్త్ బులిటెన్ విడుదల
నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో నిరంతరం అప్రమత్తంగా ఉంటూ చికిత్స అందిస్తున్నట్లు హెల్త్ బులిటెన్లో పేర్కొన్నారు. సిరివెన్నెల ఆరోగ్యానికి సంబంధించి ఎప్పటికప్పుడు వివరాలను తెలియజేస్తామని వెల్లడించారు.
ఇదీ చూడండి:ప్రముఖ గీత రచయిత సిరివెన్నెలకు అస్వస్థత.. ఐసీయూలో చికిత్స