ఇప్పటివరకు తన పాటలతో అలరిస్తున్న ప్రముఖ సింగర్ సునీత త్వరలో నిర్మాతగా మారనుందా? అంటే అవుననే సినీ వర్గాలు అంటున్నాయి. బిజినెస్‌మ్యాన్ రామ్ వీరపనేనిని ఇటీవల వివాహం చేసుకున్న ఈమె.. త్వరలో ఆయనతో కలిసి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
మ్యాంగో సంస్థల అధినేత రామ్.. 'ఏక్‌మినీ కథ' సినిమాతో నిర్మాణంలో భాగస్వామ్యమయ్యారు. త్వరలోనే ఓ వెబ్‌సిరీస్‌ను రూపొందించాలని అనుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించిన బాధ్యతల్ని సునీత స్వయంగా పర్యవేక్షించనున్నారట.