Singer Sunitha Ram wedding anniversary: తన భర్త రామ్ మంచి మనసున్న వ్యక్తి అని గాయని సునీత అన్నారు. వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని రామ్‌తో తనకున్న అనుబంధాన్ని తెలిపారు. ఈ ఏడాది ఎన్నో మధురమైన అనుభూతులు అందించిందన్నారు. ఈ మేరకు తన వివాహ వేడుక జ్ఞాపకాలతో పొందుపరిచిన ఓ స్పెషల్ వీడియోను ఆమె పోస్ట్ చేశారు. ఈ వీడియోలో సునీత వాళ్లమ్మ మాట్లాడుతూ.. "సునీత.. బరువు బాధ్యతలన్నీ తీర్చుకుంటూ చిరునవ్వు, సహనంతో జీవితంలో ముందడుగు వేసింది. డేరింగ్, అండ్ డైనమిక్ పర్సనాలిటీ. ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా" అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
అతను.. మంచి కాఫీ లాంటి అబ్బాయ్: సింగర్ సునీత - సింగర్ సునీత వివాహ వార్షికోత్సవం
Singer Sunitha Ram wedding anniversary: తన వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఓ స్పెషల్ వీడియోను పోస్ట్ చేశారు గాయని సునీత. భర్త రామ్‌తో తనకున్న అనుబంధాన్ని తెలిపారు.
సింగర్ సునీత
ఇక రామ్ గురించి సునీత మాట్లాడుతూ.. "రామ్ ముక్కుసూటి మనిషి. సుమారు ఎనిమిదేళ్ల నుంచి నాకు తెలుసు. మంచి కాఫీ లాంటి అబ్బాయ్" అంటూ ఆమె చిరునవ్వులు పూయించారు. ప్రస్తుతం ఈ వీడియో చూసిన నెటిజన్లు.. 'కంగ్రాట్స్.. వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు' అని కామెంట్లు పెడుతున్నారు.
ఇదీ చూడండి: రూహీ సింగ్.. ఈ ముద్దుగుమ్మ పోజులకు యమ క్రేజు!