తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఎస్పీ బాలు నుంచి ఎన్నో నేర్చుకున్నాను: సింగర్ సునీత - singer sunitha songs

SP balu Sunitha: తన కెరీర్​లో ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలు నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని సింగర్ సునీత చెప్పారు. ఆయన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని అన్నారు.

singer sunitha
సింగర్ సునీత

By

Published : Dec 30, 2021, 5:14 PM IST

Sunitha special event: సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టి 25 ఏళ్లు పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉందని సింగర్ సునీత అన్నారు. ఈ ప్రయాణంలో బాలు నుంచి ఎన్నో నేర్చుకున్నానని, ఆయన భౌతికంగా లేకపోయినా ఎప్పుడూ ఆయన ఆశీస్సులు ఉంటాయని చెప్పారు.

సింగర్ సునీత

హైదరాబాద్​లోని మాదాపుర్​లో జనవరి 8న 'మెలోడియస్ మూమెంట్​ విత్ సునీత' పేరుతో ఓ సంగీత కార్యక్రమం నిర్వహించారు. ప్రసాద్ ల్యాబ్స్​లో ఈ ఈవెంట్​ పోస్టర్​ను సునీత.. గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సంగీతం మానసిక ఉల్లాసం అందించడం సహా మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుందని గాయనీ సునీత అన్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు స్టీఫెన్‌ దేవస్సీతో కలిసి నిర్వహించే 'మెలోడియస్‌ మూమెంట్‌ విత్‌ సునీత' కార్యక్రమం తన జీవితంలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని చెప్పారు. గులాబీలోని 'ఈ వేళలో నీవు' పాట నుంచి ఇప్పటివరు వరకు పాడిన పాటలను వినూత్న రీతిలో సంగీత ప్రియులకు వినిపించనున్నట్లు ఆమె వెల్లడించారు.

సింగర్ సునీత

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details