ప్రముఖ గాయని సునీత(Singer Sunitha) భావోద్వేగానికి గురయ్యారు. తాను ఎంతగానో అభిమానించే, మావయ్యా అని ప్రేమగా పిలుచుకునే ప్రముఖ గాయకుడు ఎస్పీబాలుని(SP Balasubrahmanyam ) గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు సోషల్‌మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.
sunitha: 'మామయ్య.. గతంలోకి నడవాలనుంది' - సునీత పోస్ట్
'మామయ్య గతంలోకి నడవాలనుంది.. మీ పాట ఓసారి వినాలనుంది' అని భావోద్వేగ ట్వీట్ చేశారు సింగర్ సునీత(Sunitha Singer). గురుపూజోత్సవం సందర్భంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
గురు పూజోత్సవం సందర్భంగా బాలుతో దిగిన ఓ ఫోటోను షేర్ చేసిన సునీత(Sunitha Singer).. "మావయ్యా.. ఒక్కసారి గతంలోకి నడవాలనుంది. మీ పాట వినాలనుంది. మీరు పాడుతుంటే మళ్లీ మళ్లీ చెమర్చిన కళ్లతో చప్పట్లు కొట్టాలనుంది. ఇప్పుడు ఏం చేయాలో తెలియని సందిగ్ధంలో నా గొంతు మూగబోతోంది. మీరు మమ్మల్ని వదిలివెళ్లి అప్పుడే సంవత్సరం కావొస్తోందంటే నమ్మడం కష్టంగా ఉంది. ఎప్పటికీ మీరే నా గురువు, ప్రేరణ, ధైర్యం, బలం, నమ్మకం. ఎక్కడున్నా మమ్మల్నందర్నీ అంతే ఆప్యాయతతో చూసుకుంటావన్న నమ్మకముంది. ఆ నమ్మకంతోనే నేను కూడా.. బతికేస్తున్నా..!" అని సునీత పోస్ట్ పెట్టారు.