ప్రముఖ గాయకుడు బాల సుబ్రహ్మణ్యానికి కరోనా నెగిటివ్గా నిర్ధరణ అయింది. ఈ విషయాన్ని ఆయన తనయుడు ఎస్పీ చరణ్ వెల్లడించారు. ప్రస్తుతం ఆయన తన ఐపాడ్లో టెన్నిస్, క్రికెట్ మ్యాచ్లు చూస్తున్నారని తెలిపారు.
గాయకుడు ఎస్పీ బాలుకు కరోనా నెగిటివ్ - ఎస్పీబీ తాజా వార్తలు
16:44 September 07
గాయకుడు ఎస్పీ బాలుకు కరోనా నెగిటివ్
"కొన్ని రోజులుగా నాన్న ఆరోగ్య పరిస్థితిపై అప్డేట్స్ ఇవ్వనందుకు క్షమాపణలు. నాన్న ఊపిరితిత్తుల సమస్య నుంచి కోలుకుంటున్నారు. అదృష్టం ఏంటంటే ప్రస్తుతం నాన్నకు కరోనా నెగిటివ్గా నిర్ధరణ అయింది. ఇంతకుముందు కూడా చెప్పా. కరోనా నెగిటివ్ వచ్చిందా రాలేదా అన్నది సమస్య కాదు. ఆయన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తగ్గాలని అందరం కోరుకుంటున్నాం. అది త్వరలోనే జరుగుతుందని ఆశిస్తున్నా. ప్రస్తుతం ఆయన తన ఐపాడ్లో టెన్నిస్, క్రికెట్ మ్యాచ్లు చూస్తున్నారు. ఐపీఎల్ కోసం నాన్న ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఫిజియోథెరపీ జరుగుతోంది. నాన్న ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు."
-ఎస్పీ చరణ్, బాలు తనయుడు
కరోనా కారణంగా ప్రస్తుతం బాల సుబ్రహ్మణ్యం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన కోసం అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. సినీ ప్రముఖులూ బాలు త్వరగా అనారోగ్యం నుంచి బయటపడాలని కోరుకుంటున్నారు.