తెలంగాణ

telangana

ETV Bharat / sitara

విరాళాల కోసం ఎస్పీబీ వినూత్న ప్రయత్నం - ఎస్పీ బాలసుబ్రమణ్యం

కరోనా నియంత్రణకు సినీప్రముఖులు తమ వంతుగా విరాళాలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఓ వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తోన్న వారికి సాయం కోసం పాటలు పాడి విరాళాలు సేకరించనున్నారు.

Singer SP Balasubramaniam collects donations for those performing duties in disasters
విరాళాల కోసం విన్నూత్న ప్రయత్నం చేస్తున్న ఎస్పీబీ

By

Published : Mar 27, 2020, 11:59 AM IST

కరోనా పోరులో పలువురు సినీ ప్రముఖులు విరాళాలు ప్రకటించి వారి దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రముఖ నేపథ్య గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. ఈ విపత్కర పరిస్థితుల్లో పారిశుధ్ద్య, పోలీసు, వైద్యులకు సాయం చేయాలన్న ఉద్దేశంతో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

విరాళాల కోసం విన్నూత్న ప్రయత్నం చేస్తున్న ఎస్పీబీ

శ్రోతలు, నెటిజన్లు కోరిన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో శని, సోమ, బుధ, గురువారాల్లో రాత్రి 7 గంటల నుంచి 7:30 గంటల వరకు పాటలు పాడనున్నట్లు ఎస్పీబీ వెల్లడించారు. అయితే శ్రోతలు కోరిన పాటను వినిపించాలంటే సాధారణంగా 100 రూపాయల రుసుము చెల్లించాలని కోరారు. తద్వారా సమకూరే నిధులను శ్రోతల అభిప్రాయం మేరకు ప్రధాని, ముఖ్యమంత్రుల సహాయనిధికి అందజేయనున్నట్లు బాలసుబ్రహ్మణ్యం తెలిపారు.

ఇదీ చూడండి.. కరోనా కట్టడి కోసం చిరు, పవన్​, మహేశ్​తో పాటు

ABOUT THE AUTHOR

...view details