తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'బాలూ.. త్వరగా కోలుకుని తిరిగి రా' - singer spb health condition

కరోనా పోరాడుతున్న ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. త్వరగా కోలుకుని తిరిగి రావాలని అన్నారు ఇళయరాజా. ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని మెగాస్టార్ చిరంజీవి కూడా ట్విట్టర్​లో పోస్ట్ పెట్టారు.

'బాలూ.. త్వరగా కోలుకుని తిరిగి రా'
ఎస్పీ బాలు-ఇళయరాజా

By

Published : Aug 15, 2020, 7:19 AM IST

కరోనా బారిన పడి ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని ప్రముఖ గాయకుడు ఇళయరాజా ఆకాంక్షించారు. బాలుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఓ వీడియోను విడుదల చేశారు.

"బాలూ..తొందరగా కోలుకుని రా.. నీ కోసం ఎదురు చూస్తుంటాను. మనిద్దరి జీవితం కేవలం సినిమాలతోనే ముగిసిపోదు... సినిమాలతోనే మొదలైందీ కాదు. వాటికన్నా ముందు మనం సంగీత వేదికలపై చేసిన కచేరీ కార్యక్రమాలు... ఆ సంగీతం మనకు జీవితమూ, జీవితాధారమూ అయ్యాయి. ఆ వేదికలపైన మొదలైన మన స్నేహం... సంగీతమూ, స్వరమూ లాంటిది. స్వరం లేని సంగీతం ఎలా ఉండలేదో అలా నీ స్నేహం, నా స్నేహం, మన స్నేహం ఎన్నడూ దూరం కాదు. ఇద్దరి మధ్య గొడవ వచ్చినా... రాకున్నా స్నేహం స్నేహమేననీ నాకూ తెలుసూ, నీకూ తెలుసూ. కాబట్టి నువ్వు కోలుకుని లేచి రా. నువ్వు తిరిగి వస్తావని నా అంతరాత్మ చెబుతోంది. అది నిజం కావాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను"

-ఇళయరాజా, సంగీత దర్శకుడు

ప్రస్తుతం బాలు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ఆయన్ను వెంటిలేటర్​పై ఉంచి చికిత్సనందిస్తున్నారని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ చెప్పారు. అభిమానులు, స్నేహితులు చూపిస్తున్న ఆదరణ గురించి మాట్లాడిన బాలు సోదరి వసంత.. ఆయన త్వరలో కోలుకుని తిరిగి వస్తారని ధీమా వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details