కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతంగా విజృంభిస్తోంది. మహమ్మారి సోకిన వారిలో చాలామందికి ఆక్సిజన్ అందించాల్సి వస్తోంది. ఫలితంగా ప్రభుత్వ ప్రైవేటు ఆస్పత్రుల్లో పడకల కొరత వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు ఈ ఆక్సిజన్ పడకలను ఏర్పాటు చేసేందుకు ముందుకొస్తున్నారు.
100 ఆక్సిజన్ పడకలు ఏర్పాటు చేసిన స్టార్ సింగర్ - Singer Smitha 100 oxygen beds
కరోనా పరిస్థితుల్లో ప్రాణవాయువు కొరతతో సతమతమవుతున్న వైరస్ బాధితులను ఆదుకునేందుకు పాప్ సింగర్ స్మిత ముందుకొచ్చింది. పలు కొవిడ్ సెంటర్లలో మొత్తంగా కలిపి 100 ఆక్సిజన్ పడకలను ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని ట్వీట్ చేసింది.
ఈ క్రమంలోనే పాప్ సింగర్ స్మిత.. మంచి మనసు చాటుకున్నారు. గతంలో తాను స్థాపించిన ఏఎల్ఏఐ సహా ఈఓ స్వచ్ఛంద సంస్థల ద్వారా పలు ప్రాంతాల్లోని కొవిడ్ కేర్ సెంటర్లకు 100 ఆక్సిజన్ పడకలను ఏర్పాటు చేసే దిశగా కార్యక్రమం చేపట్టారు. ఇందుకు సంబంధించిన పనులు గత కొద్దిరోజులుగా జరుగుతున్నాయి. ఇప్పుడు వాటి ఏర్పాటు పూర్తయినట్లు, తాను అనుకున్న లక్ష్యం నెరవేరినట్లు వెల్లడిస్తూ, పడకలకు సంబంధించిన ఫొటోలను స్మిత ట్వీట్ చేశారు. ఈ కార్యక్రమంలో భాగమైన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి: పాప్ సింగర్ స్మిత దంపతులకు కరోనా పాజిటివ్