స్నేహితులు, బంధువులను వివాహ అనంతర పార్టీ(పోస్ట్ వెడ్డింగ్ మీట్)కి ఆహ్వానించి ఓ ఆసక్తికరమైన సన్నివేశాన్ని నెమరు వేసుకున్నాడు ప్రముఖ సింగర్ రాహుల్ వైద్య. తన శోభనానికి ఎలాంటి ఆటంకం ఎదురైందో చెప్పుకొచ్చాడు. ఇటీవలే నటి దిశా పర్మర్తో వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు రాహుల్.
ముంబయిలోని గ్రాండ్ హయత్ హోటల్లో ఈ జంట పోస్ట్ వెడ్డింగ్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో రాహుల్ మైక్ తీసుకుని తన మామ వల్లే తమ శోభనానికి భంగం కలిగిందని చెప్పుకొచ్చాడు. పక్కనే నిల్చుని ఉన్న అతడి సతీమణి దిశా నవ్వుతూనే ఉంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.