సుశీల పాటలను స్మరించటమంటే కొన్ని దశాబ్దాల తెలుగు చలనచిత్రాల గమనాన్ని కూడా గుర్తు చేసుకున్నట్టే! ఆమె సినీరంగ ప్రవేశం చేసిన 1952 నాటికే బాలసరస్వతీదేవి. జిక్కి, పి.లీల, ఎం.ఎల్. వసంతకుమారి లాంటి ప్రతిభావంతులన గాయనులుండేవారు. వారి మధ్య తన ఉనికిని చాటుకోవటం అంత సులువైన పని కాదు. ఆమె మొదటి పాట 'కన్నతల్లి' చిత్రంలోది. పెండ్యాల సంగీత దర్శకత్వంలో ఎందుకు పిలిచావెందుకు అన్న ఆ పాటను ఎ.ఎం రాజాతో కలిసి పాడారు.
1956 సంవత్సరం సుశీల ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసింది. అంతవరకు చిన్నచిన్న పాత్రలకు తన కంఠాన్నిస్తూ వచ్చిన సుశీల మొదటిసారిగా కథానాయిక పాత్రకు 'మా తోడికోడళ్ళు' చిత్రంలో పాడింది. తెలుగు, తమిళ బాషల్లో నిర్మించిన ఆ చిత్రానికి నాయిక (సావిత్రి) పాటలన్నీ రెండు బాషల్లోనూ సుశీలే పాడింది. రెండు బాషల్లోనూ ఆ చిత్రం ఘన విజయం సాధించింది. సుశీల ప్రాచుర్యం కూడా ఎంతోగానో ఇనుమడించింది’’ అన్నారాయన.
అందుకే తెలుగులో 1955 నుంచీ చాలాకాలం వరకూ సుశీల పాటలేని చిత్రం దాదాపు లేకపోయింది. 1960 - 1970ల మధ్య తొలి భాగం వరకూ ఆమె కెరియర్‌లోనే అత్యుత్తమమని సంగీతభిమానులు భావిస్తారు. "1980 తర్వాత సినిమాలో వేగం పెరిగింది. 'గుగ్గుగ్గుగ్గు గుడిసుంది' లాంటి పాటలు పాడనన్నా నాచేత పాడించారు. అవి మరోతరం ప్రేక్షకులకు నన్ను దగ్గర చేశాయి" అంటారు సుశీల. తెలుగు సినీసంగీత స్వర్ణయుగ చరిత్రంలో ఆమెది ఘనతర ఆధ్యాయం!