తెలంగాణ

telangana

ఆ సంగీత కళాకారులకు అండగా మనో

By

Published : Jul 20, 2021, 9:03 PM IST

గాయకుడు మనో తనలోని ఉదారతను చాటుకున్నారు. కరోనా రెండో దశతో ఆర్థికంగా ఇబ్బందిపడుతున్న 200 మంది సంగీత కళాకారులకు నిత్యావసర సరకులను స్వయంగా అందించారు.

Singer Mano Distributed Groceries to 200 Cine Musicians
200 మందికి సింగర్​ మనో సాయం

ప్రముఖ సింగర్​ మనో గొప్ప మనసును చాటుకున్నారు. కరోనా రెండో దశ కారణంగా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న 200 మంది సంగీత కళాకారులకు నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. కరోనా సంక్షోభంలో సతమతమవుతున్న సినీ మ్యూజిషియన్​ కుటుంబాలకు తన వంతుగా సహాయపడినట్లు గాయకుడు మనో తెలిపారు.

నిత్యావసర సరుకులు అందజేస్తున్న సింగర్​ మనో
నిత్యావసర సరుకులు అందజేస్తున్న సింగర్​ మనో

ప్రముఖుల విరాళాలు..

మరోవైపు కరోనా కట్టడిలో భాగంగా ప్రభుత్వాలకు అండగా నిలుస్తున్నారు సెలబ్రిటీలు. వారికి తోచిన సాయం చేస్తూ మంచి మనసు చాటుకుంటున్నారు. ఈ క్రమంలోనే విలక్షణ నటుడు విజయ్​సేతుపతి​ కూడా బాధితులకు అండగా నిలిచారు. తమిళనాడు ప్రభుత్వ సహాయనిధికి ఇటీవలే రూ.25లక్షల విరాళం ప్రకటించారు. అంతకు ముందు సూపర్​స్టార్​ రజనీకాంత్​ రూ.50లక్షలు, ఆయన కుమార్తె సౌందర్య కుటుంబం రూ. కోటి విరాళం, సూర్య, ఆయన సోదరుడు కార్తి రూ.కోటి, చియాన్ విక్రమ్ రూ.30 లక్షలు, హీరోలు అజిత్‌, దర్శకుడు మురుగదాస్‌ చెరో రూ.25 లక్షలు తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇచ్చారు.

నిత్యావసర సరుకులు అందజేస్తున్న సింగర్​ మనో
నిత్యావసర సరుకులు అందజేస్తున్న సింగర్​ మనో

ఇదీ చూడండి..బాలయ్య-పూరీ జగన్నాథ్​ కాంబోలో మరో చిత్రం

ABOUT THE AUTHOR

...view details