తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'బాత్​రూమ్​లో దాక్కోలేదు.. అది పెద్ద పార్టీ కాదు' - corona virus image

కరోనా పాజిటివ్​ను తేలిన బాలీవుడ్​ గాయని కనికాను ఓ మీడియా సంస్థ సంప్రదించగా.. జరిగిన విషయాల్ని చెప్పింది. ఇమ్మిగ్రేషన్​లో తాను తప్పించుకోలేదని, తాను వెళ్లిన పార్టీ పెద్దది కాదంది.

'బాత్​రూమ్​లో దాక్కోలేదు.. అది పెద్ద పార్టీ కాదు'
కనికా కపూర్​

By

Published : Mar 21, 2020, 4:29 PM IST

Updated : Mar 21, 2020, 8:16 PM IST

తాను స్క్రీనింగ్‌ పరీక్షల నుంచి తప్పించుకోవడం కోసం విమానాశ్రయంలోని బాత్‌రూమ్‌లో దాక్కోలేదని ప్రముఖ బాలీవుడ్‌ గాయని కనికా కపూర్ చెప్పింది. దేశంలో కరోనా విస్తరిస్తోన్న తరుణంలో ఇటీవలే లండన్‌ నుంచి భారత్‌కు వచ్చిందీ సింగర్. అనంతరం ఆమెకు వైరస్‌ ఉందని వైద్యులు శుక్రవారం నిర్ధారించారు. విదేశాల నుంచి వచ్చిన ఆమె స్వీయ నిర్బంధంలోకి వెళ్లకుండా లఖ్‌నవూలో ఏర్పాటు చేసిన పలు పార్టీలకు హాజరైంది. ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు సదరు గాయనిని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అంతేకాకుండా లండన్‌ తిరిగొచ్చినప్పుడు ఎయిర్‌పోర్ట్‌లో ఎలాంటి పరీక్షలు చేయించుకోలేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

తాజాగా కనికాను ఓ మీడియా సంస్థ ఫోన్‌లో సంప్రదించింది. 'ఎయిర్‌పోర్టులో స్క్రీనింగ్‌ను తప్పించుకోవడానికి బాత్‌రూమ్‌లో దాక్కున్నానని వస్తున్న వార్తలన్నీ వదంతులు. ఓ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్‌ వద్ద ఏవిధంగా స్క్రీనింగ్‌ను తప్పించుకోగలమో చెప్పండి? ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో నిర్వహించిన స్క్రీనింగ్‌ పరీక్షలో నేను పాల్గొన్నాను. ఓ రోజంతా ఆ ఊర్లోనే ఉన్నా. కరోనా కారణంగా సినిమాలకు సంబంధించిన పనులన్నీ రద్దు కావడం వల్ల నా తల్లిదండ్రులు ఇంటికి రమ్మన్నారు. దాంతో మార్చి 11 ఉదయాన్నే లఖ్‌నవూకు విమానంలో వెళ్లాను. ముంబయి నుంచి వెళ్లేవరకూ నాకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేనప్పుడు మరొకరు నా స్వీయ నిర్బంధం ఎలా కోరుకుంటారు. నిజం చెప్పాలంటే నాలుగు రోజుల నుంచే నాలో ఈ లక్షణాలు కనిపించాయి' అని ఆమె చెప్పింది.

కరోనా వైరస్​కు సంబంధించిన చిత్రం

అనంతరం పార్టీలకు వెళ్లడం గురించి మాట్లాడుతూ.. 'నేను ఎవరికీ ఎలాంటి పార్టీ ఇవ్వలేదు. కాకపోతే చిన్న పుట్టినరోజు వేడుకలో మాత్రమే పాల్గొన్నా. దుశ్యంత్‌ సింగ్‌తోపాటు పలువురు రాజకీయనాయకులు ఆ పార్టీకి వచ్చారు. అందరూ చెప్పుకుంటున్నట్లు అది పెద్ద పార్టీ కాదు. 400మంది పాల్గొనలేదు. అందులో నేను ఓ అతిథిని మాత్రమే. నాతోపాటు పార్టీలో పాల్గొన్న ఇతరుల గురించి ఇప్పటికే అధికారులకు చెప్పాను' అని గాయని చెప్పింది.

Last Updated : Mar 21, 2020, 8:16 PM IST

ABOUT THE AUTHOR

...view details