ప్రముఖ గాయని ఎస్ జానకి మరణించారంటూ సామాజిక మాధ్యమాల్లో వార్తలు వైరలయ్యాయి. ఈ విషయంపై తాజాగా ఆమె ఆడియో రూపంలో ఓ సందేశాన్ని ఇచ్చారు. తాను క్షేమంగానే ఉన్నట్లు.. ఇలాంటి వదంతులను నమ్మవద్దంటూ వెల్లడించారు. ఇలాంటి వార్తలు ఎలా రాస్తారో అర్థం కావట్లేదంటూ అసహనం వ్యక్తం చేశారు.
నేను బాగానే ఉన్నా.. వదంతులు నమ్మొద్దు: జానకి - జానకి మరణంపై పుకార్లు
ప్రముఖ గాయని జానకి మరణించారంటూ వస్తోన్న వార్తలపై అభిమానులు, సినీ ప్రముఖులు మండిపడుతున్నారు. ఇలాంటి వదంతులు ఎలా రాస్తారంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై గాయని జానకి స్వయంగా స్పందించారు.
![నేను బాగానే ఉన్నా.. వదంతులు నమ్మొద్దు: జానకి Singer Janaki reaction about her demise news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7818520-thumbnail-3x2-kaa.jpg)
నేను బాగానే ఉన్నా.. పుకార్లు నమ్మొద్దు: జానకి
నేను బాగానే ఉన్నా.. వదంతులు నమ్మొద్దు: జానకి
ఇంతుకుముందు ఈ వార్తలపై గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా స్పందించారు. ఇలాంటి చెత్త రాతలేంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఉదయం నుంచి తనకు ఎన్నో ఫోన్లు వచ్చాయని, వారంతా జానకి గారికి ఏమైందని ప్రశ్నించారని తెలిపారు. కొంతమంది ఏ మాత్రమూ విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారని, సినీ కళాకారుల అభిమానులకు ఇటువంటి వార్తలు వింటే గుండెపోటు వచ్చే అవకాశాలు ఉన్నాయని, అటువంటిది ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. తాను స్వయంగా జానకమ్మతో మాట్లాడానని, ఆవిడ చాలా బాగున్నారని అన్నారు.