తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నటుడిగా మారిన సినీ గేయ రచయిత చంద్రబోస్ - Singer chandrabose turns as actor in Tugluq movie

గేయ రచయిత చంద్రబోస్​ నటుడిగా మారారు. ఆయన 'తుగ్లక్'​ సినిమాలో ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఆయన పాత్రకు సంబంధించిన ఫస్ట్​ లుక్​ను విడుదల చేసింది చిత్రబృందం.

chandrabose
చంద్రబోస్​

By

Published : Mar 7, 2021, 4:37 PM IST

ఇప్పటికే చాలామంది సినీ గేయ రచయితలు నటులుగా మారారు. ఓ పాటలోనో, కీలక సన్నివేశంలోనో కనిపించి అలరించారు. తాజాగా ఆ జాబితాలో చేరారు చంద్రబోస్‌. 'తుగ్లక్‌' సినిమాలో ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారాయన. ఈ పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను దర్శకుడు హరీశ్‌ శంకర్‌ విడుదల చేశారు. కళ్లజోడు పెట్టుకుని సీరియస్‌గా కనిపిపించారు చంద్రబోస్‌. ఈ చిత్రంలోని 'యే జిందగీ' అనే పాటలో నటించిన దృశ్యాల్నీ విడుదల చేశారు. చంద్రబోస్‌తో పాటు సంగీత దర్శకుడు, గాయకుడు రఘు కుంచె దర్శనమిచ్చారు.

ఈ చిత్రాన్ని రోహన్‌ సిద్ధార్థ్‌, సుమన్‌ శెట్టి, చైతన్య ప్రియ ప్రధాన పాత్రల్లో ప్రణీత్‌ పండగ తెరకెక్కిస్తున్నారు. గీతా టాకీస్‌ పతాకంపై పరమ గీతా నల్లెబోయిన నిర్మిస్తున్నారు. అనిల్‌ నందూరి, మహేశ్‌ ధీరా సంగీతం అందిస్తున్నారు. గతేడాది విడుదలైన 'నీలి నీలి ఆకాశం', ఇటీవలే వచ్చిన 'ఒకే ఒక లోకం నువ్వే' లాంటి సూపర్‌ హిట్ గీతాలు చంద్రబోస్‌ రచించినవే.

ఇదీ చూడండి: 'ఆలోచించండి అన్నలారా.. ఆవేశం మానుకోండి తమ్ముళ్లారా'

ABOUT THE AUTHOR

...view details